Guppedantha Manasu Oct 31 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జగతి మహేంద్ర కు తినిపిస్తూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్లో మహేంద్ర, జగతితో నేను ఏమైనా తప్పు చేశానా జగతి అనగా తొందరపడ్డావు మహేంద్ర అని అంటుంది. అప్పుడు మహేంద్ర పొలమారడంతో రిషి తల్చుకుంటున్నాడేమో కదా జగతి అని వాళ్ళు ఎమోషనల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు జగతి కాస్త ఫీల్ గా మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత వారిద్దరు రిషిని తలుచుకొని బాధపడుతూ ఉంటారు.
మరొకవైపు వసుధార, రిషి ఇద్దరు అమ్మవారి దగ్గరికి వెళ్తారు. అప్పుడు రిషి ఇక్కడికెందుకు పిలుచుకొని వచ్చావు అని అనడంతో అమ్మవారితో మాట్లాడాలి సార్ అని అంటుంది. అప్పుడు వసుధార రిషికి అమ్మవారి ముందు బొట్టు పెట్టి రిషి చేతులు పట్టుకొని నన్ను క్షమించండి సార్ అని ఎమోషనల్ గా అడుగుతుంది.
రిషి ఎందుకు వసుధార అని అనడంతో నా ఆలోచనలు నా మొండితనం అన్ని మీపై చూపిస్తూ మిమ్మల్ని జగతి మేడంని అమ్మ అని పిలవమని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అని అంటుంది. మనసులో ఉన్న బాధలు భారం ఇక్కడ దించేసుకుని వెళ్దాం అమ్మవారి సన్నిధిలో ఉన్నాం. నా మొండి తనంతో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతుంది.
Guppedantha Manasu అక్టోబర్ 31 ఎపిసోడ్ : వసుధార ఎమోషనల్..
అప్పుడు రిషి ఏమైంది నీకు ఏం చెప్పాలి అనుకుంటున్నావు అని అనడంతో మీ గొప్పదనం ముందు మీ సహనం ముందు నేను ఓడిపోయాను సార్ అని అంటుంది వసుధార. మీతో కలిసి తుది శ్వాస వరకు నడచాల్సిన నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతుంది వసుధార.
అప్పుడు రిషి ఇవన్నీ ఎందుకు వసు అని అనడంతో ఆరోజు మీరు చీర ప్రేమతో ఇచ్చిన నేను కట్టుకోలేదు ఆ బాధ కూడా నన్ను వెంటాడుతోంది సార్ అని అంటుంది వసుధర. అప్పుడు వసుధార, ప్రేమతో మాట్లాడడంతో రిషి సంతోషపడుతూ ఉంటాడు. ఇప్పుడు వసుధర మన మధ్య ఎటువంటి అడ్డంకులు ఉండవు ఉండనివ్వను అని మాట ఇస్తున్నాను సార్ అనడంతో రిషి సంతోషపడతాడు.
అప్పుడు మనిషి చాలా సంతోషంగా కనిపిస్తూ అమ్మవారికి మొక్కుకుంటారు. అప్పుడు రిషి అమ్మవారి ముందు ఉన్న గులాబీ పూలు తీసుకొని వసుధారపై పూల వర్షం కురిపిస్తాడు. అది చూసి వసుధార సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు వసుధార కూడా రిషి పై పూల వర్షం కురిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ సంతోషంగా కనిపిస్తారు.
మరొకవైపు కాలేజీలో కాలేజీ స్టాప్ మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.
అప్పుడు ఇంటికి ఫోన్ చేయగా ధరణి లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉండగా ఇంతలో దేవుయాని ఫోన్ లాక్కుంటుంది. అప్పుడు జగదీ మేడం ఇంట్లో లేరు ఎక్కడికి వెళ్లారో తెలియదు అసలు వస్తారో రారో తెలియదు ఇంకొకసారి మీరు ఫోన్ చేయకండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది దేవయాని. అప్పుడు ధరణి ఎందుకు అత్తయ్య అలా చెప్పారు అని అనగా ధరణి మీద సీరియస్ అవుతుంది. ఇంతలోనే దేవయాని దగ్గరికి గౌతమ్ వస్తాడు. మరొకవైపు వసుధార రిషి ఇద్దరు సంతోషంగా కారులో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు.