Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం. నిన్నటి ఎపిసోడ్ లో సౌర్య, ప్రేమ్, నిరూపమ్,హిమ అందరూ కలిసి రెస్టారెంట్ కి వెళ్ళగా అక్కడ జ్వాలా ప్రేమ్ ని ఆట పట్టిస్తుంది.
ఈరోజు ఎపిసోడ్ లో రెస్టారెంట్ నుంచి సౌర్య, ప్రేమ్, నిరూపమ్,హిమ లు బయటకు వస్తారు. అప్పుడు ప్రేమ్ మీరు ఎలా వెళ్తారు అని నిరూపమ్,హిమ ను అడగగా అప్పుడే జ్వాలా నేనే ఆటో తీసుకుని వెళ్తాను అని అంటుంది. అప్పుడు వారిద్దరూ కాసేపు గొడవ పడతారు. ఆ తర్వాత నిరూపమ్, హిమ మేము ఆటోలో వెళ్తాము నువ్వు వెళ్ళు అని చెప్పి ప్రేమ్ పంపిచగా, అప్పుడు ప్రేమ్ ఏదో ఒక రిజన్ చెప్పి ఆటో లోనే వెళ్తాడు.
అప్పుడు ఆటోలో నిరూపమ్ ని చూసి జ్వాలా మురిసిపోతూ వుంటుంది. మరోవైపు ప్రేమ్ కూడా హిమ ని చూసి మురిసిపోతూ ఉంటాడు. మరొకవైపు స్వప్న, ఆనందరావు నిరూపమ్ క్లినిక్ లేడు అని కోప్పడుతూ ఉంటారు. ఇంతలో నిరూపమ్, హిమ కలిసి రావడంతో హిమ పై కోపంతో విరుచుకుపడుతూ నానా మాటలు అని హిమ ను బాధ పెడుతుంది స్వప్న. దీనితో హిమ ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
మరొకవైపు సౌందర్య హిమ రూమ్ లో లైట్ ఆఫ్ చేయడానికి వెళ్లి అక్కడ హిమ,సౌర్య ఫోటోలు చూసి బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు స్వప్న, ఆనందరావు లు తినకుండా నిరూపమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో నిరూపమ్ వచ్చి నేను తిన్నాను తాతయ్య మీరు వెళ్లి తినండి అని అనగా అప్పుడు స్వప్న ఎక్కడ తిన్నావ్ రా అని అడుగుతుంది.
అప్పుడు నిరూపమ్,జ్వాలా క్యారీ తీసుకొని వచ్చింటే తిన్నాను అని చెప్పడంతో నిరూపమ్ పై సీరియస్ అవుతూ నానారకాలుగా మాటలు అంటుంది స్వప్న. నీకు నేను పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నాను అని స్వప్న చెప్పగా అప్పుడు నిరూపమ్ స్వప్న పై కోప్పడతాడు. రేపటి ఎపిసోడ్ లో సౌందర్య ముఖం పై సౌర్య చూసుకోకుండా నీళ్లు చల్లడం తో సౌందర్య కోపంతో సౌర్య పగలగొడుతుంది. అప్పుడు సౌందర్యాన్ని చూసిన సౌర్య ఎమోషనల్ అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World