Karthika Deepam june 30 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దుర్గ జ్వాలా ఆటోకి పూజలు చేస్తూ ఉంటాడు.
ఈరోజు ఎపిసోడ్ లో నిరుపమ్, హిమను గుడికి రమ్మని చెబుతాడు. అప్పుడు హిమ ఏంటి బావ గుడికి రమ్మన్నావు అని చెప్పగా నీతో పెళ్లి జరగబోతోంది కదా అందుకే గుడిలో ముడుపు కడతాను అని అనడంతో వెంటనే హిమ మన పెళ్లి కాలేదు కదా అని అంటుంది.
అప్పుడు అయినా పర్లేదు నేను ముడుపు కడతాను అని అనడంతో అప్పుడు హిమ నీకు, జ్వాలాకి పెళ్లి జరగాలని నేను ముడుపు కడతాను అనడంతో నిరూపము షాక్ అవుతాడు. అలా వారిద్దరూ వాదించుకుంటూ ఉంటారు. ఇక అక్కడికి వచ్చిన జ్వాల వారిద్దరిని చూసి హిమను మరింత అపార్థం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
మరొకవైపు సౌందర్య, ఆనందరావు జరిగిన విషయం తలుచుకుని సౌర్య హిమ లు ఎప్పుడు కలిసి పోతారు,వారిద్దరిని ఎలా కలపాలి అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. మరొకవైపు నిరుపమ్, హిమ ను పేషంట్ అంటూ హాస్పిటల్ లో ఆట పట్టిస్తూ మాట్లాడుతాడు.
అప్పుడు హిమ నేను నిజంగానే పేషెంట్ ని కదా బావ అని అనడంతో నిరుపమ్ బాధపడుతూ ఉంటాడు. ఇక హిమ,జ్వాలా ప్రస్తావన తీసుకురావడంతో నిరుపమ్ హిమ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ జ్వాలా తన స్థాయికి తగ్గట్టుగా ఏ ఆటో వాడిని చూసుకుని పెళ్లి చేసుకుంటుంది అనడంతో అప్పుడు హిమ,నిరుపమ్ పై మండి పడుతుంది.
జ్వాలాకి ఆ గతి ఇంకా పట్టలేదు పట్టనివ్వను అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. మరొకవైపు జ్వాలా జరిగిన విషయాల్ని తెలుసుకుని బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి సౌందర్య, ఆనంద్ రావులు వస్తారు. అప్పుడు వారిద్దరూ జ్వాలాకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు.
ఆనందరావు నీకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని అనడంతో ఆనందరావు పై కోపంతో విరుచుకుపడుతుంది జ్వాలా. రేపటి ఎపిసోడ్ లో హిమ,వెళ్ళి జ్వాలా చేయి పట్టుకోవడంతో జ్వాల కోప్పడుతుంది. అప్పుడు ఈ సినిమా అసలు విషయాన్ని చెప్పేస్తుంది
Read Also : Karthika Deepam june 29 Today Episode : సౌందర్య,ఆనంద్ రావులపై మండిపడిన జ్వాలా.. బాధతో కుమిలిపోతున్న హిమ..?