...

Guppedantha Manasu serial Sep 16 Today Episode: వసు,రిషి ల ఏకాంతాన్ని చెడగొట్టిన దేవయాని..రిషి ని హత్తుకున్న వసు..?

Guppedantha Manasu serial September 16 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో వసు అందంగా అవడంతో వసు వైపు అలాగే చూస్తూ ఉంటాడు రిషి. ఈరోజు ఎపిసోడ్ లో వసుధార వైపు రిషి అలాగే చూస్తూ నేను ఈరోజు కాఫీకి దూరంగా ఉంటాను నువ్వు మళ్ళీ కాపీ ఒలకబోస్తే డ్రెస్ మార్చుకునే ఓపిక నాకు లేదు అని అనగా వెంటనే వసు సారీ అని అంటుంది. అప్పుడు వారిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా రిషి వసుధారకు చీర కొంగు కప్పి చూసావా చీరలో నువ్వు ఎంత అందంగా ఉన్నావు అని అంటాడు.

Advertisement
Rishi and Vasudhara share a romantic moment in todays guppedantha manasu serial episode
Rishi and Vasudhara share a romantic moment in todays guppedantha manasu serial episode

ఆ తర్వాత వారిద్దరు దగ్గరగా వచ్చి ముద్దు పెట్టుకోవాలి అనుకుంటూ ఉండగా ఇంతలోనే దేవయాని అక్కడికి వచ్చి వాళ్ళ మూడ్ ని చెడగొట్టి రిషి ని అక్కడి నుంచి పిలుచుకొని వెళ్తుంది. తర్వాత వసుధార ఫంక్షన్ లో వాళ్లతో మాట్లాడుతూ ఉండగా అప్పుడు రిషి వసు లు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు.

Advertisement

అది చూసిన జగతి మహేంద్ర మురిసిపోతూ ఉంటారు. ఇక వారిద్దరూ ఆనందంగా ఉండడం చూసి ఏ దేవయాని తట్టుకోలేక పోతుంది. దేవయానికి కోపంగా కనిపించడంతో ధరణి వెళ్లి పలకరించగా దేవయాని ధరణిపై కోప్పడి అక్కడి నుంచి వెళ్లిపోమని చెబుతుంది. ఆ తర్వాత గౌతమ్ కేక్ తెచ్చి అన్ని ఏర్పాట్లు చేయడంతో జగతి దంపతులు కేక్ కట్ చేస్తారు.

Advertisement

Guppedantha Manasu serial Sep 16 Today Episode : రిషి ని హత్తుకున్న వసు..?

అప్పుడు మహేంద్ర మొదటి కేకు జగతికి పెడదాం అనుకుంటూ ఉండగా అప్పుడు జగతి వద్దు రిషికి పెట్టమని చెబుతుంది. తనకు వద్దు జగతి మేడంకి పెట్టమని చెబుతాడు. దాంతో జగతి సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత వసు చీరలో ఇబ్బంది పడుతున్నట్టుగా ఉండి అక్కడ నుంచి బయటకు వెళ్తూ ఉండగా రిషి కూడా వసు ని ఫాలో అవుతూ అక్కడి నుంచి వెళ్తాడు.

Advertisement

ఇంకా అక్కడికి వెళ్లి వసుధార కోసం వెతుకుతూ ఉండగా ఇంతలోనే వసు వెనక వైపు నుంచి వచ్చి రిషిని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అప్పుడు వసు థాంక్స్ సర్ థాంక్యూ సో మచ్ అని అంటుంది. అప్పుడు రిషి వెనక్కి తిరిగి వసుధారణి గుండెలకు హత్తుకుంటాడు. అలా వారు కాసేపు హత్తుకుని ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు.

Advertisement

ఆ తర్వాత జగతి దంపతులు భోజనం చేస్తూ రిషి వాళ్ళు కనిపించలేదు అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు మహేంద్ర వారిద్దరూ లేరు అంటే ఎక్కడికో వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు అర్థం చేసుకోండి జగతి మేడం అని అంటాడు. ఇంతలోనే వసుధార, రిషి లు అక్కడికి రాగా గౌతమ్ రిషి ని హగ్ చేసుకుని థాంక్స్ అని చెబుతాడు. ఆ తర్వాత గౌతమ్ తిందాం పద రిషి అని అనగా నువ్వు వెళ్ళు గౌతమ్ అని రిషి దేవయాని దగ్గరికి వెళ్లి తినమని చెప్పి పిలుస్తూ ఉంటాడు.

Advertisement

Read Also : Guppedantha Manasu serial Sep 15 Today Episode : అందంగా ముస్తాబు అయిన మహేంద్ర దంపతులు..వసుధారని అలాగే చూస్తూ ఉండిపోయిన రిషి..?

Advertisement
Advertisement