Karthika Deepam Aug 15 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ప్రేమ్, నిరుపమ్ మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో హిమ,నిరుపమ్ కి కాల్ చేయడంతో నిరుపమ్ ఫోన్ మాట్లాడుతూ ఉండగా అప్పుడు ప్రేమ్ పెళ్లి సమయం దగ్గర పడుతుంది ఎలా అయినా మమ్మీ కి డాడీ కి చెప్పాలి అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు స్వప్న తన, సత్యం ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ప్రేమ్ అక్కడికి వస్తాడు.
ఇంతలో ప్రేమ్ తన ప్రేమ గురించి చెప్పాలి అనుకుంటూ ఉండగా అప్పుడు స్వప్న శోభ విషయంలో అయోమయంలో ఉన్నాను ఇప్పుడు నీ విషయాలు ఏమి చెప్పకు అని అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ప్రేమ్ బాధపడుతూ ఉంటాడు. తరువాత సౌందర్య కుటుంబం అందరూ గుడిలో దేవుడికి మొక్కుతూ ఉండగా అప్పుడు సౌందర్య సౌర్యని దేవుడికి దండం పెట్టుకో అని చెప్పడంతో సౌర్య నాకు అడగాల్సినవి ఏమీ లేదు అంటూ పొగరుగా సమాధానం చెబుతుంది. అప్పుడు సౌర్య మళ్లీ తన తల్లిదండ్రులు రావాలి అని కోరుకోగా సౌందర్య మనవరాళ్ల గురించి కోరుకుంటూ ఉంటుంది.
Karthika Deepam Aug 15 Today Episode : డాక్టర్ బాబు, దీప బతికే ఉన్నారన్న వారణాసి..
అప్పుడు హిమ,సౌర్య గురించి ఆలోచిస్తూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత పూజారి ఇది శుభ సమయం అనడంతో వెంటనే హిమ అసలు విషయాన్ని సౌర్యకి చెప్పాలి అనుకుంటుంది. ఇక హిమ, సౌర్య దగ్గరికి వెళ్లి నీకు ఒక విషయం చెప్పాలి అనగా మొదటి శౌర్య కోపంగా మాట్లాడుతుంది. కానీ హిమ, సౌర్య మాటలు పట్టించుకోకుండా సారీ నీ పక్కకు లాక్కొని వెళ్తుంది. అప్పుడు హిమ గతంలో యాక్సిడెంట్ అయిన సమయంలో తన తల్లిదండ్రులు చెప్పిన మాటలు చెప్పడంతో సౌర్య ఆ మాటలు నమ్మదు.
అప్పుడు హిమ,సౌర్యలు వాదించుకుంటూ ఉండగా ఇంతలోనే సౌందర్య అక్కడికి వస్తుంది. హిమ నిరుపమ్ ని పెళ్లి చేసుకోమని చెప్పగా అమ్మానాన్నలు వస్తే చెబితేనే నేను పెళ్లి చేసుకుంటాను అని అంటుంది శౌర్య. ఇంతలోనే వారణాసి ఎక్కడికి వచ్చి సౌర్య చెప్పింది నిజమే డాక్టర్ బాబు, దీపమ్మ బతికే ఉన్నారు అని అంటాడు. మాట విని అందరు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత వారణాసి జరిగింది మొత్తం వివరిస్తారు. హాస్పటల్ లో బెడ్ పైనుంచి కోరుకున్న వంటలక్క డాక్టర్ బాబు అంటూ హాస్పిటల్ మొత్తం తిరుగుతూ ఏడుస్తుంది. ఆ తర్వాత దీపాతనం గతాన్ని మొత్తం తలుచుకొని బాధపడుతూ ఉంటుంది.