Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
అనసూయ దంపతులు ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో తులసి కుటుంబం అందరూ బాధపడుతూ ఉంటారు. కానీ లాస్య, నందు మాత్రం తులసిదే తప్పు అన్నట్టుగా మాట్లాడుతూ గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు తులసి గొడవ పడడం ఆపేసి ముందు వాళ్ళు ఎక్కడ ఉన్నారు వెతుకుదాం రండి అని అనడంతో అప్పుడు లాస్య వాళ్ళు వెతికినా దొరకరు ఎందుకంటే వాళ్ల నువ్వే దాచావు అంటూ తులసి పై నిందలు వేస్తుంది.
అప్పుడు దివ్య కోపంతో మా అమ్మ పై లేనిపోని నిందలు వేయడం ఉంది అని అంటుంది.కానీ నందు మాత్రం ఇదంతా తులసి కుట్ర అంటూ తులసి ఫైర్ అవుతాడు. అప్పుడు తులసి అత్తయ్య మామయ్య లను నేను వెతికి తీసుకువస్తాను అంటూ కోపంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది.
మరొకవైపు ప్రేమ్ తన ఫ్యూచర్ గురించి తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో దివ్య, ప్రేమ్ కి కాల్ చేసి ఇంట్లో జరిగిందంతా వివరిస్తుంది. అప్పుడు ప్రేమను నువ్వేం బాధపడకు నానమ్మ తాతయ్యలు ఎక్కడ ఉన్నా నేను తీసుకు వస్తాను అంటూ దివ్యకు మాట ఇస్తాడు. మరొకవైపు లాస్య వచ్చింది కదా అని తులసిపై లేనిపోని నిందలు వేస్తూ,మనసు నొచ్చుకునే విధంగా మాటలు మాట్లాడుతూ ఉంటుంది.
ఇంతలో పని మనిషి రాములమ్మ లాస్య కు వేడివేడిగా టీను ఇస్తుంది. అప్పుడు లాస్య రాములమ్మ పై ఫైర్ అవ్వడంతో అప్పుడు రాములమ్మ ఏమాత్రం లెక్కచేయకుండా తులసిపై తిరగబడుతుంది. ఒకవైపు అనసూయ దంపతులు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ బాధపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే వారిని చూసిన తులసి మావయ్య మావయ్య అంటూ వారి వెంట పడుతుంది.
ఈ క్రమంలోనే తులసికి కనిపించకుండా పక్కకు వెళ్లి దాక్కుంటారు. అప్పుడు తులసి బయటకు రండి మామయ్య అంటూ ఏడుస్తూ వేడుకుంటుంది. తులసి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత అనసూయ దంపతులు ఆశ్రమానికి వెళ్లారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రేమ్ కూడా అక్కడికి వెళ్లి వాళ్లు లేరు అని తెలిసి వెనక్కి వస్తాడు.
మరొకవైపు లాస్య తులసినీ నానా మాటలు అంటూ తులసిని బాధపడుతుండటంతో అసహనం వ్యక్తం చేసిన మాధవి లాస్య పగలగొడుతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.