Intinti Gruhalakshmi: తల్లి పరిస్థితులు తెలుసుకుని కుమిలిపోతున్న ప్రేమ్.. అనసూయ దంపతులకు కోసం బయలుదేరిన నందు..?

Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో తులసి ఇంటిని విడిచి తన ఫ్యామిలీతో కలిసి అద్దె ఇంటికి వెళుతుంది. ఈ క్రమంలోనే తులసి కుటుంబసభ్యులు ఎమోషనల్ అవుతూ ఉంటారు.

ఈరోజు ఎపిసోడ్ లో ఇంటిని విడిచి వెళ్ళిపోతూ ఉండగా పని మనిషి రాములమ్మ వెళ్లొద్దు అని వేడుకుంటుంది. ఇన్ని రోజులు పని చేసిన నేను మీకు పని మనిషి లాగా కనిపిస్తున్నానా అమ్మా, మన మధ్య వేరే అనుబంధం లేకపోతే మీరు నా కూతురు ఆపరేషన్ కి ఎందుకు సహాయం చేశారు. ఎందుకు గాజులు అమ్మి మరీ నాకు డబ్బులు ఇచ్చారు.

Advertisement

ఎందుకు నన్ను తోబుట్టువులా చూసుకున్నారు నన్ను దూరం చేయకండి అమ్మ నన్ను కూడా మీతోనే ఉండనీయండి అని అనగా, ఇప్పుడు మేము ఉన్నా ఈ పరిస్థితులలో మా జీవితాలు మాకు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి మీకు జీతం ఇచ్చే పరిస్థితి లేకపోవచ్చు అని ఏడ్చుకుంటూ బయటకు వెళ్లిపోతుంది. మరొకవైపు ప్రేమ్ తన తల్లి గురించి కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు.

Advertisement

ఇంతలో అక్కడికి శృతి వచ్చి ప్రేమ్ ని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ ప్రేమ్ తన నిర్ణయాన్ని మార్చుకోకుంటే తులసి దగ్గరికి వెళ్ళాలి అని పట్టుబడతాడు. అప్పుడు ప్రేమ్ నీకు ఇష్టం లేకపోతే చెప్పు నిన్ను ఇబ్బంది పెట్టను నేను ఒక్కడినే వెళ్తాను అని అంటాడు. అప్పుడు శృతి నీతో రావడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రేమ్ కానీ మనతో ఆంటీ మాట్లాడదు కదా అని బాధపడుతుంది శృతి.

ఇది అక్షర ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు మన మొహం చూడడానికి కూడా ఇష్టం లేదని చెప్పింది ఆ విషయం చెబితే నువ్వు బాధపడతావ్ అని నేను చెప్పలేదు అని అంటుంది శృతి. కానీ ప్రేమ్ ఏ మాత్రం వినిపించుకోకుండా సముద్రం అలలు అంటూ భారీ డైలాగులు చెబుతాడు. మరొకవైపు అద్దె ఇంటికి చేరుకున్న తులసి కుటుంబం ఇంటిని చూసి ఆశ్చర్యపోతారు.

Advertisement

అప్పుడు తులసి ఆ ఇంటిని చూసి బాధపడుతూ ఇంత పెద్ద ఇంటికి మనం రెంట్ కట్టగలమా ఆలోచిస్తూ ఉండగా అప్పుడు అభి మామ ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లే అమెరికా కి వెళ్ళాడు ఇంటిని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఉంటే చాలు ఎంత ఇచ్చిన పర్లేదు అని అన్నాడు అందుకే ఈ ఇల్లు మనకు ఇచ్చి వెళ్ళాడు అని చెబుతాడు అభి. మరొకవైపు లాస్య, మందులు మాట్లాడుకుంటూ ఉంటారు.

అప్పుడు నందు లాస్య బయలుదేరు వెళ్లి మా అమ్మానాన్నలు పిలుచుకొని వద్దాం అని అంటాడు. అప్పుడు లాస్య ఆ ముసలి ప్రాణాలు మళ్ళీ తిరిగి వచ్చి పడతాయి అని లోలోపల పడుతూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా నందు తులసి ఇంటికి వెళ్లి తులసి పై విరుచుకు పడతాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement