Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గృహలక్ష్మి సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం..
తులసి, తో ప్రేమ్, శృతి ఈ విషయంలో తీసుకున్న నిర్ణయం తనకు నచ్చలేదు అని అంకిత చెబుతుంది. కానీ తులసి మాత్రం ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇంతలో తులసి ఇంటికి వచ్చిన మాధవి తులసి తో మాట్లాడుతూ ఉంటుంది. తులసి జరిగిన విషయాన్ని మొత్తం వివరిస్తూ ఉంటుంది.
మరొక వైపు దివ్య ప్రేమ్, శృతి వదినలు వచ్చే వరకు నేను అన్నం తినను అని మొండిపట్టు పడుతుంది. అంకిత ఎంత నచ్చజెప్పడానికి ప్రయత్నించినప్పటికీ దివ్య మాత్రం మొండి పట్టు పడుతుంది. మరోవైపు తులసి నాకు ఒక్క నిర్ణయం వల్ల అందరూ బాధపడుతున్నారు. అమ్మ ఎందుకు ఇలా చేసింది అని ఒక్కరు కూడా ఆలోచించడం లేదు అని బాధ పడుతుంది.
మరోవైపు దివ్య అంకిత తో మాట్లాడుతూ కళ్ళు తిరిగి కింద పడి పోతుంది. వెంటనే అంకిత దివ్య ని చెక్ చేసి అనంతరం తినకపోవడం వల్ల కళ్ళు తిరిగాయి నీరసంగా ఉంది అని చెబుతోంది. మాధవి దివ్యకి నచ్చక ప్రయత్నించినప్పటికీ దివ్య మాత్రం వినలేదు. నా పెళ్లి అయ్యేవరకు అయినా మా అన్నయ్యతో కలిసి ఉండాలి అనుకోవడం నా తప్ప అత్తయ్య అని దివ్య అడుగుతుంది.
తులసి దివ్య కు నచ్చచెప్పడానికి ప్రయత్నించగా నాకు ఎవరు ఏమి చెప్పొద్దు ఇక్కడి నుంచి అందరూ వెళ్లిపోండి అని గట్టిగా అరుస్తుంది. అక్కడి నుంచి పక్కకు వెళ్లి పోయిన తులసి మొండితనంతో ఉన్న దివ్య గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. మరో వైపు శృతి, ప్రేమ్ లు కొత్త ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉంటారు.
మధ్య మధ్య లో రొమాంటిక్ సాంగ్ లకు డాన్స్ లు కూడా చేస్తూ ఉంటారు. దివ్య గురించి తెలుసుకున్న నందు ఏమైంది అని కంగారు పడుతూ వచ్చి దివ్యను అడగగా మీ గొడవలకు మమ్మల్ని బడి చేస్తున్నారు డాడీ అని అంటుంది. దీనితో మందు కోపంతో తులసి దగ్గరికి వెళ్లి అది ప్రేమ వచ్చేవరకు అన్నం తినను అంటుంది.
అలాగే ఉంటే దివ్య పరిస్థితి ఏమవుతుంది తులసి పై ఫైర్ అవుతాడు నందు. అప్పుడు తులసి ప్రేమ్ వచ్చాక మీరు ఎప్పుడూ గొడవ పడను అని మాట ఇస్తే పిలుచుకొని వస్తాను అంటుంది. అప్పుడు సరే అని మాట ఇస్తాడు నందు. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.