Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసుధార గదిలోపల డ్రస్సు మార్చుకుంటూ ఉంటుంది.
ఈ రోజు ఎపిసోడ్ లో వసుధర ఉండే గదికి ఒక అతను బయటనుంచి గడిగ వేసి వెళ్ళిపోతాడు. మరొకవైపు ఫణింద్ర జగతి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు ఫణింద్ర మీరు అలా వెళ్ళిపోవడం ఏంటో నాకు అర్థం కావడం లేదు మహేంద్ర వచ్చాడా అని అడగగా రాలేదు అని చెప్పడంతో అసలు ఏం జరుగుతుందమ్మా అని జగతిని అడుగుతాడు ఫణింద్ర. అయినా వసుధర ఇంత పెద్ద విజయాన్ని సాధించినప్పుడు మహేంద్ర పక్కన లేకపోవడం ఏంటమ్మా అని అంటాడు ఫణింద్ర.
ఒక్కసారి అయినా రిషి గురించి ఆలోచించారా, మామూలుగా మహేంద్ర ఒక గంట కనబడకపోతే రిషి టెన్షన్ పడతాడు అటువంటిది ఇన్ని రోజులు ఎలా ఉన్నాడు ఎంత బాధను భరించాడో అని అనడంతో జగతిలో లోపల బాధపడుతూ ఉంటుంది. సరే ఈ విషయాలన్నీ ఇంటర్వ్యూ అయిపోయాక మాట్లాడుకుందాం అని ఫణింద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు వసుధార బయటకు వెళ్లాలి అనుకుంటుండగా ఇంతలో తలుపు రాకపోవడంతో ఎవరు గడియ పెట్టి ఉంటారు హలో ఎవరైనా ఉన్నారా అని అరిచినా ఎవరూ పలకక పోయేసరికి ఇంతలో వసుధార రిషికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో రిషి షాక్ అవుతాడు.
అప్పుడు రిషి అక్కడికి వెళ్తాడు. అప్పుడు లోపలికి వెళ్ళగానే సర్ నేను బట్టలు మార్చుకుంటూ ఉండగా ఎవరు బయట నుంచి గెడియ పెట్టారు సార్ అని అనడంతో సరే వసుధర అక్కడ అందరూ ఎదురుచూస్తున్నారు కదా అనుకుంటూ ఉండగా ఇంతలోనే ఒక అతను బయట నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు రిషి తలుపు తీసిన రాకపోవడంతో చెప్పాను కదా ఒకసారి కావాలని ఎవరు ఇలా చేస్తున్నారు అనడంతో సరే వసుధార టెన్షన్ పడకు అని రిషి వేరే వాళ్లకు ఫోన్ చేస్తూ ఉండగా వద్దు సార్ మనిద్దరిని ఇలా చూస్తే ఎవరైనా తప్పుగా అనుకుంటారు అని అంటుంది.
ఆ తర్వాత రిషి బయటకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మరొకవైపు తలుపుకు గడియ పెట్టిన అతను మీడియా ప్రతినిధికి సక్సెస్ అంటూ సైడ్ చేయడంతో సరే అని అంటాడు. ఆ తర్వాత వసుధార రిషి ఇద్దరు తలుపులు తీసి చూసేసరికి అక్కడ మీడియా వాళ్ళు కాలేజీ స్టాప్ స్టూడెంట్స్ మొత్తం ఉండటం చూసి షాక్ అవుతారు. ఏంటి రిషి సార్ ఇది ఏం జరుగుతుంది అని అనడంతో రిషి అసలు విషయం చెప్పినా కూడా ఆ మీడియా ప్రతినిధి తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మీరు ఒక కాలేజీ లెక్చరర్ తను ఒక స్టూడెంట్ వీరిద్దరూ కలిసి లోపల అని అనడంతో వెంటనే రిషి చాలు ఇక ఆపండి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి అని సీరియస్ అవుతాడు.
అప్పుడు ఆ మీడియా ప్రతినిధి వసుధార కాలేజీలో ఎంతమంది ఫ్రెండ్స్ లెక్చరర్స్ ఉండగా మీకే ఎందుకు ఫోన్ చేసింది అయినా మీరు ఇద్దరు ఎందుకు లోపల ఉన్నారు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడంతో పసుధార నేను చెబుతాను అంటూ జరిగింది మొత్తం వివరిస్తుంది. అయినా కూడా ఆ మీడియా ప్రతినిధి అలాగే మాట్లాడడంతో ఇంతలో మహేంద్ర నేను మాట్లాడవచ్చా అని లోపలి నుంచి ఎంట్రీ ఇవ్వడంతో అది చూసిన రిషి సంతోషపడతాడు. మహేంద్ర ను చూసిన జగతి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు. నేను మాట్లాడవచ్చా నీ మహేంద్ర సీరియస్ గా అనడంతో మీడియా ప్రతినిధి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు.
నా కొడుకు రిషి నన్ను కలవడానికి లోపల వచ్చాడు అయినా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు లోపల ఉంటే తప్పు తప్పుగా అనుకుంటారా అని సీరియస్ అవుతాడు మహేంద్ర. అప్పుడు మీడియా ప్రతినిధి మాట్లాడడంతో మాట్లాడకండి అని సీరియస్ అయ్యి అక్కడ నుంచి వాళ్ళందర్నీ పంపించేస్తాడు మహేంద్ర. అప్పుడు రిషి ఎమోషనల్ గా మహేంద్ర ను హత్తుకొని థాంక్స్ డాడ్ అని అంటాడు. ఆ తర్వాత రిషి అక్కడి నుంచి వెళ్ళిపోగా జగతి అసలేం జరిగింది మహేంద్ర అనడంతో మహేంద్ర జరిగింది మొత్తం వివరిస్తాడు. తర్వాత ప్రోగ్రాం మొదలవడంతో జగతి వసుధారని అభినందిస్తూ వసుధార గురించి ఇంట్రడక్షన్ ఇస్తూ ఉంటుంది. అనంతరం పుష్ప వచ్చి బొకే ఇచ్చి వసు కు కంగ్రాట్స్ చెప్పడంతో ఆ తరువాత జగతి మహేంద్ర ను రిషి పనింద్రను వేదిక పైకి ఆహ్వానిస్తుంది జగతి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World