Intinti Gruhalakshmi May 20 Today Episode : తెలుగు లో ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో అనసూయ డబ్బు కోసం వంటలు చేసి డబ్బులు సంపాదిస్తాను అంటూ కొత్తగా యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభిస్తుంది.
ఈరోజు ఎపిసోడ్ లో తులసి సరుకుల కోసం షాప్ దగ్గరికి వెళ్లగా అక్కడ షాపు అతను తులసిని తిరుగుతుండడంతో అప్పుడు ప్రేమ మధ్యలో కలుగ చేసుకుని అతని పై విరుచుకు పడతాడు. దీంతో తులసి నువ్వు ఎవరు ఈ విషయంలో మాట్లాడడానికి అని ప్రేమ్ ని పరాయి వ్యక్తిలా చూస్తుంది.

ఇక జాబ్ పోవడంతో ప్రేమ్ నిరాశతో ఇంటికి బయలుదేరుతాడు. ఇంటి దగ్గర ఇంటి ఓనర్ డబ్బు కోసం కాచుకొని ఉండగా ఇంతలో శృతి వచ్చి ఇంటి అద్దె డబ్బులు కడుతుంది. అప్పుడు ఇంటి ఓనర్ నెల అద్దె కడితే ఇంట్లో ఉండండి లేదంటే ఇప్పుడే ఖాళీ చేసి వెళ్లిపోండి అని కఠినంగా మాట్లాడుతుంది.
అప్పుడు ప్రేమ్ భార్య ముందు చేతకాని వాడిలా తలదించుకోవాల్సి వచ్చింది అని బాధ పడుతూ ఉండగా అప్పుడు శృతి అలా అనుకోవద్దు అని ఓదారుస్తుంది. మరొకవైపు తులసి జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ కూరలో ఉప్పు కారం ఎక్కువ వేస్తుంది. ఇక ఇంట్లో అందరూ భోజనానికి వచ్చి కూర్చోగా తులసి ఆ వంటలను వారికి వర్తిస్తుంది.
వారు మాత్రం ఆ వంటలను పేర్లు పెట్టకుండా అలాగే కారంగా ఉన్నా కూడా తినేసి వెళ్లిపోతారు. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత దివ్య అసలు విషయం చెప్పడంతో, ఆ తర్వాత తులసి వెళ్లి మిమ్మల్ని సరిగా చూసుకో లేక పోతున్నాను అని బాధపడుతుంది.
అప్పుడు అనసూయ ధైర్యం చెబుతూ నువ్వేమీ బాధపడకు నేను మొదలు పెట్టిన నానమ్మా స్ సక్సెస్ అవుతుంది అని చెప్పగా, అప్పుడు పరంధామయ్య నేను కావాలంటే సెక్యూరిటీ గార్డుగా పని చేస్తాను అని అనడంతో అనసూయ సెటైర్లు వేస్తుంది. మరొకవైపు నందు లక్కీ కోసం వీడియో గేమ్ తీసుకుని వస్తాడు. లక్కీ ఆ వీడియో గేమ్ తీసుకోకపోవడంతో నందు కోప్పడతాడు.
నాకు ఈ అంకుల్ ఎప్పటికీ అంకుల్ మాత్రమే డాడీ కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు అనసూయ ఇంట్లో చదువుకుంటూ ఉండగా ఇంతలో ఇద్దరు పిల్లలు వచ్చి తులసి మేడం ఉందా, తులసి టీచర్ ఉందా అని అడగడంతో ఆ మాటలకు అనసూయ ఆనందం వ్యక్తం చేస్తుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also :Intinti Gruhalakshmi: నందుని అవమానించిన తులసి, దివ్య.. కోపంతో రగిలి పోతున్న లాస్య..?