Karthika Deepam: మోనితకు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన దీప..సరికొత్త ప్లాన్ వేసిన మోనిత..?

Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మోనిత ఎలా అయినా దీపను వదిలించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.

Advertisement

ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ బాబు పేరు అడగడంతో మోనిత చెబితే ఏమైనా అవుతుందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ ఏం ఆలోచిస్తున్నావు మోనిత అని అనగా ఏం లేదు కార్తీక్ ఈ పేరుని చెప్పినా కూడా మర్చిపోతావు కదా అందుకే ఆలోచిస్తున్నాను అని అంటుంది. అప్పుడు వెంటనే కార్తీక్ మర్చిపోతే మళ్ళీ చెప్పు అని అంటాడు. వెంటనే మోనిత బాబు పేరు ఆనంద్ అని చెప్పడంతో అక్కడి నుంచి ఆనంద్ అని పిలుస్తూ వెళ్లిపోతాడు కార్తీక్.

Advertisement

ఆ తర్వాత దీప కార్తీక్ కోసం ఇంట్లోకి వెళుతూ ఉండగా ఇంతలో మోనిత అక్కడికి వచ్చి దీప ను తిడుతుంది. సిగ్గు లేదా పదేపదే మా కాపురంలో చిచ్చులు పెడుతున్నావు అని అనగా, కాపురం గురించి నువ్వు మాట్లాడకు,నువ్వు బాబుని ఎలా కన్నావో అందరికీ తెలుసు. ఇక నీలాంటి దాన్ని ఏమంటారు ఊర్లో వెళ్లి కనుక్కో అని అంటుంది దీప. ఆ మాటకు మోనిత కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

Advertisement

డాక్టర్ బాబుకు గతం గుర్తుకు రాకుండా చేస్తున్నావు ఆ టాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని నీకు తెలియదా అని అనడంతో నాకు ఇంతటి నుంచి వేరే ఆలోచన రాలేదు అని అంటుంది మోనిత. అయినా తాళి కట్టిన భర్త అయితేనే కదా డాక్టర్ బాబుకు ఏమైనా నీకు ఏమీ అని అంటుంది దీప. ఒకవేళ డాక్టర్ బాబుకు ఏమైనా అయితే ఇంకొకరిని తగులుకుంటావు అని దీపా అనగా వెంటనే మోనిత కోపంతో రగిలిపోతూ ఇంకొక్కసారి అలా మాట్లాడావనుకో చంపేస్తాను అంటూ వార్నింగ్ ఇస్తుంది.

ఇప్పుడు దీప కార్తీక్ ని పిలుస్తుంది. డాక్టర్ బాబుకు నేనంటే అభిమానం అందుకే నేను పిలవగానే వస్తాడు అని అంటుంది. అప్పుడు కార్తీక్ నేను బాబుతో గతంలో ఎంత బాగా ఉండేవాడినో అని అనగా దీప ఏం బాధపడకండి అని గుర్తుకు వస్తాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు శౌర్య,హిమ ఇద్దరూ రోడ్డు మీద ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ ఉంటారు. ఇక ఆనందరావు వారిద్దరిని ఓదార్చడానికి ప్రయత్నించినా కూడా వాళ్ళు కోపంతో మాట్లాడుతూ ఉంటారు.

Advertisement

నేను మీ నుంచి దూరంగా వచ్చేసాను కదా ఈ అడ్రస్ ఎలా తెలిసింది అని సౌర్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈ సారి మళ్ళీ ఇక్కడికి వస్తే మీకు కనిపించనంత దూరం వెళ్లిపోతాను అని అంటుంది శౌర్య. మరొకవైపు మౌనిత ఆలోచిస్తూ ఉండగా ఇంతలో కార్తీక్ అక్కడికి వచ్చి మోనిత నేను ఒకటి అడుగుతాను ఏమీ అనుకోవు కదా నీకు ఆ వంటలక్క అంటే ఎందుకు అంత భయం. నిజం చెప్పు నువ్వు నా భార్య నా లేక ఆ వంటలక్క నా భార్య నా అని అనడంతో మోనిత షాక్ అవుతుంది.

ఆ తర్వాత కార్తీక్ ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడంతో ఏం చెప్పాలో తెలియక వనిత ఏడుస్తూ కొత్త నాటకం మొదలు పెడుతుంది. కోసం ఎంత చేశాను ఎంత కష్టపడ్డాను ఇవన్నీ నీకు ఏమీ తెలియదు అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటుంది. మరొకవైపు దీప వాళ్ళ డాక్టర్ అన్నయ్యని పిలిచి జరిగిన విషయం చెబుతుంది. అప్పుడు అతను చెప్పిన మాటలు అన్నీ గుర్తుకు వస్తాయి కానీ కళ్ళు తిరిగి లేచిన తర్వాత మళ్ళీ ఏమి గుర్తుకు ఉండదు అని అంటాడు.

Advertisement

అప్పుడు దీప అంటే నేను చేసిన ప్రయత్నాలు అన్ని వృధానేనా అన్నయ్య అని బాధపడుతూ ఉండగా ఎప్పటికీ వృధా కావు అని ధైర్యం చెబుతాడు. మరొకవైపు మోనిత బట్టలు సర్దుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి కార్తీక్ వస్తాడు. అప్పుడు సరికొత్త ప్లాన్ వేసిన మౌనిక ఇక్కడ మనం ఉండటం లేదు వెంటనే వెళ్లి బట్టలు సర్దుకో అని అంటుంది. అప్పుడు కార్తీక్ ఎంత నచ్చజెప్పినా వినిపించకుండా ఏం మాట్లాడకుండా వెళ్లి బట్టలు సర్దుకో కార్తీక్ అని అంటుంది.

ఆ తర్వాత శివ,దీప దగ్గరికి వెళ్లి మా మేడం సాన్ని తీసుకొని ఎక్కడికో వెళ్తుంది అని చెప్పడంతో దీప టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ తర్వాత మౌనిత దగ్గరికి వెళ్లి వంటలకు చెప్పాను మేడం అని చెబుతాడు శివ. అప్పుడు ఆ వంటలకు టెన్షన్ పడుతుందా అని అడగగా అవును మేడం అనడంతో మోనిత ఆనంద పడుతూ ఉంటుంది. అప్పుడు మోనిత ఆనంద పడుతూ ఇప్పుడు నిన్ను ఎలా ముప్పు తిప్పలు పెడతాను చూడు వంటలక్క అని నవ్వుకుంటూ ఉంటుంది.

Advertisement