Karthika Deepam: మోనితను టార్గెట్ చేసిన దుర్గ, కార్తీక్.. బాధతో కుమిలిపోతున్న వంటలక్క..?

Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మోనిత కార్తీక్ ముందు నాటకాలు ఆడుతూ ఉంటుంది.

Advertisement

ఈరోజు ఎపిసోడ్ లో మోనిత ఆ దుర్గ గాడు ఏదో చేస్తే నువ్వు నన్ను అనుమానిస్తున్నావు కార్తీక్ అందుకే నేను ఏం చేస్తున్నానో నాకే అర్థం కావడం లేదు నిజంగా నన్ను నమ్ము కార్తీక్ అంటూ కార్తీక్ చేతులు పట్టుకుని బ్రతిమలాడుతూ ఉంటుంది. ఆ వంటలక్కనే ఈ దుర్గని పంపించింది వారిద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారు అని అనగా వంటలక్క కు ఏంటి అవసరం అనడంతో నువ్వు నన్ను అసహ్యించుకుని అనుమానించి వదిలేస్తే ఆ దీప నీకు దగ్గర అవ్వాలని చూస్తోంది కార్తీక్ అని అంటుంది మోనిత. నిజంగా నువ్వు చెప్పినట్టుగా ఆ వంటలక్క మనిషి అయితే మరి నీకు వంటలక్కపై శత్రుత్వం ఎందుకు ఎందుకు తన రెండు సార్లు చంపాలని చూసావు అని కార్తీక్ నిలదీయడంతో అబద్ధాలు చెప్పి తప్పించుకుంటుంది మోనిత.

Advertisement

మరొకవైపు దీప కార్తీక్ ఫోటో పట్టుకుని ఏడుస్తూ ఎమోషనల్ అవుతూ ఉండగా ఇంతలో ఆ ఇంటి ఓనర్ అక్కడికి వస్తుంది. ఎవరు మీరు అని దీప అడగగా నేను ఇంటి ఓనర్ ని అని చెబుతుంది. అప్పుడు అయినా ఆ డాక్టర్ బాబు ఫోటో మీ దగ్గరే ఉంది ఏంటి అక్కడ నుంచి ఎందుకు తీశారు అనడంతో అప్పుడు దీప తను మీకు తెలుసా అని అనడంతో తెలుసమ్మా ఆ డాక్టర్ బాబు నా భర్తకు వైద్యం చేస్తుండగా అతను మరణించడంతో నేను ఆయన్ని అనకూడని మాటలు అన్నాను కానీ ఆయన నన్ను ఏమీ అనకుండా ఆయన సంపాదించిన ఆస్తి మొత్తం నా పేరు మీద రాసి ఇచ్చిన గొప్ప వ్యక్తి ఆ డాక్టర్ బాబు కానీ ఆయన, ఆయన భార్య కారు యాక్సిడెంట్లు మరణించారు అనటంతో దీప లేదు ఆయన చనిపోలేదు ఆయన బతికే ఉన్నారు.

Advertisement

నేను ఎవరో కాదు ఆ డాక్టర్ బాబు భార్యని అనడంతో ఆమె సంతోష పడుతూ ఉంటుంది. మరి మీరేంటమ్మా ఇలా ఎక్కడ ఉన్నారు అనడంతో అదంతా పెద్ద కథ నేను తర్వాత చెబుతాను నా కూతుర్ని వెతకడం కోసం ఇక్కడికి వచ్చాను నాకు హెల్ప్ చేస్తావా అని దీప అడగగా మీరు నన్ను హెల్ప్ అడగడం ఏంటి అమ్మ మీకోసం ఏమైనా చేస్తాను. నీకోసం ఒక కారు డ్రైవర్ని పంపిస్తాను. కూతురిని ఊరు మొత్తం తిరిగి వెతకమ్మ అని చెబుతుంది. మరొకవైపు మోనిత బయటకు వెళ్తుండగా కార్తీక్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడగడంతో సంతోషంతో ఇలా నువ్వు నన్ను అడగడమే కావాలి కార్తీక్.

పెళ్లయిన కొత్తలో ఇలాగే అడిగే వాడివి కానీ ఆ దీప వచ్చిన తర్వాత మారిపోయావు అని అనడంతో వెంటనే కార్తీక్ తన మనసులో ఏమి నాటకాలు ఆడుతున్నావే ఒకవేళ నాకు గతం గుర్తుకు రాకపోయి ఉంటే నువ్వు చెప్పే సోదంతా నేను నిజమని నమ్మేవాడిని అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు దీప శౌర్య కోసం వెతుకుతూ ఉండగా ఇంతలో ఆమెకు సౌర్య అతికించిన పోస్టర్ కనిపిస్తుంది. అప్పుడు సౌర్య పోస్టర్ ని చూసిన దీప ఎమోషనల్ అవుతూ ఉంటుంది. నువ్వు కూడా నాలాగే మా కోసం వెతుకుతున్నావా అత్తమ్మ అని ఎమోషనల్ అవుతుంది.

Advertisement

ఇంతలోనే దీప వాళ్ళ ఇంటి ఓనర్ అక్కడికి రావడంతో అమ్మాయి ఇదిగో నా కూతురు చూడండి నా కోసం వెతుకుతుంది అనడంతో దీప ఆ పోస్టర్ లో ఇచ్చిన ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి అక్కడికి వెళ్తుంది. మరొకవైపు కార్తీక్ దీప గురించి ఆలోచిస్తూ దీప అక్కడ ఇబ్బందులు పడుతుందో అనుకుంటూ ఉండగా అప్పుడు దుర్గ అక్కడికి వచ్చి సారీ కార్తీక్ సార్ మీరు లేరు అనుకోని వచ్చారు మీరు ఉన్నారా అని ఎక్కడి నుంచి వెళ్తుండగా, రేయ్ దుర్గా అని పిలవడంతో ఏంటి పిలుపు మారింది అని అనుకుంటాడు దుర్గ. నాకు మొత్తం తెలుసు దుర్గ నాకు గతం గుర్తుకు వచ్చింది ఆ మోడీ తన టార్చర్ చేయడం కోసమే నువ్వు అలా చేస్తూ ఉన్నావని నాకు తెలుసు అనడంతో దుర్గ సంతోషపడతాడు.

ఇంకేంటి కార్తీక్ సార్ ఎందుకు దీపమ్మ కి అసలు విషయం చెప్పలేదు అనడంతో ఇంకా సమయం ఉంది దుర్గా నా కూతురు సౌర్యని వెతికి ఆ తర్వాత ఈ మోనిత పని పడతాను అని అంటాడు కార్తీక్. ఆ తర్వాత కార్తీక్ నేను సౌర్య కోసం దీప కోసం సంగారెడ్డికి వెళ్తున్నాను నువ్వు ఇక్కడే ఉండి ఆ మోనిత సౌర్య గురించి తెలుసేమో అడిగి తెలుసుకో అని చెబుతాడు. అప్పుడు సరే కార్తీక్ బాబు నువ్వు దీపమ్మని గురించి ఆలోచించండి నేను ఈ మోనిత ని చూసుకుంటాను అని అంటాడు దుర్గ. మరొకవైపు దీప వాళ్ళ ఇంటి ఓనర్ కలిసి ఒక ఇంటి దగ్గరికి వెళ్తారు.

Advertisement

అక్కడ సౌర్య ఇంద్రుడు లేకపోయేసరికి ఆ ఇంద్రుడు నన్ను మళ్ళీ మోసం చేశాడు అని దీప ఎమోషనల్ అవుతూ ఆ ఇంటి ఓనర్ కి జరిగింది మొత్తం వివరిస్తుంది. అప్పుడు ఆమె నువ్వేం టెన్షన్ పడకు ఏడవకు దీప ఇక్కడే ఉన్నాడు అని తెలిసింది కదా ఎక్కడికి పోతాడు వెతికి పట్టుకుందాం నువ్వు ధైర్యంగా ఉండు అని ధైర్యం చెబుతుంది. అప్పుడు సరే ఇంటికి వెళ్దాం పద అని అనగా వద్దంది నన్ను కొద్దిసేపు ఒంటరిగా వదిలేయండి అని అంటుంది దీప.

Advertisement