Karthika Deepam july 8 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జ్వాలా ఏడుస్తూ ఎమోషనల్ అవుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి ఇంద్రమ్మ దంపతులు వచ్చి టెన్షన్ పడుతూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో జ్వాల ఏం జరిగిందో చెప్పమ్మా అని ఇంద్రమ్మ అడుగుతూ ఉండగా అప్పుడు జ్వాల ఇంద్రమ్మని పట్టుకొని గట్టిగా ఎమోషనల్ అవుతుంది. అప్పుడు ఇంద్రమ్మ, జ్వాలమ్మ ఎప్పుడు ఏం తినిందో ఏమో వెళ్లి ఏమని తీసుకొని రా గండ అని ఇంద్రుడిని బయటికి పంపిస్తుంది. మరొకవైపు సౌందర్య,ఆనంద్ రాయ్, హిమ కారులో వెళ్తూ జరిగిన విషయాన్ని తెలుసుకొని బాధపడుతూ ఉంటారు.
రోజు ఉదయాన్నే ఆనంద్ రావు జ్వాలా ఇంటి ముందు కూర్చుని ఉండడంతో జ్వాలా ఆశ్చర్య పోతుంది. అప్పుడు శౌర్య ఏంటి తాతయ్య మీరు ఇక్కడ ఉన్నారు అని అడగగా అప్పుడు ఆనంద్ రావు మా రెండో మనవరాలు కనిపించమని ప్రతిరోజు ఆ దేవుడికి మొక్కుతూనే ఉన్నాను. చివరికి దేవుడు వరమిచ్చాడు. కానీ నువ్వే నువ్వే కరుణించట్లేదు అని అనడంతో జ్వాలా ఎమోషనల్ అవుతుంది.
అప్పుడు ఆనందరావు పదరా బంగారం వెళ్దాం మీ నానమ్మ ఎదురుచూస్తుంది అని ఎంత బ్రతిమలాడినా కూడా శౌర్య మనసు మాత్రం కరగదు. మరొకవైపు హిమ,కార్తీక్ దీపల ఫోటోల ముందు నిలబడి తన బాధలు చెప్పుకుంటూ ఉంటుంది. అప్పుడు సౌందర్య అక్కడికి వచ్చి హిమను ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు హిమ ఎలా అయినా నిరుపమ్,కి సౌర్య కి పెళ్లి చేయాలి అని అనుకుంటుంది.
Karthika Deepam : శౌర్యకి డాక్టర్ సాబ్ తో పెళ్లి చేసే బాధ్యత తీసుకున్న హిమ..
ఎలా అయినా సరే వాళ్ళిద్దర్నీ కలిపి నేను సౌర్యకి దగ్గర అవుతాను అని అంటుంది హిమ. ఇక జ్వాల శౌర్య అన్న విషయాన్ని స్వప్నకు చెప్పొద్దు అని చెబుతుంది సౌందర్య. ఇంతలోనే ఆనందరావు కోసం ఎదురుచూస్తూ ఉండగా ఆనందరావు వచ్చి అక్కడ జరిగిన విషయాన్ని తలుచుకుని బాధపడుతూ ఎమోషనల్ అవుతాడు. ఇక సౌర్య ఎప్పటికీ ఈ ఇంటికి రాదేమో అని సౌందర్య తో చెప్పుకొని కుమిలిపోతూ ఉంటాడు ఆనందరావు.
మరొకవైపు హిమ, జ్వాలా ఇంటికి వెళ్లి అక్కడ వంట చేస్తూ ఉండగా అది చూసిన జ్వాల ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు అని అడగడంతో వంట చేస్తున్నాను అని సమాధానం ఇస్తుంది హిమ. ఎంతైనా మనం వంట లెక్క కూతుర్లం కదా అక్క చెల్లెలం కదా అనడంతో జ్వాల, హిమ ను బయటకు గింటేయబోతూ ఉండగా అప్పుడు ఎలా అయినా నీకు, మీ డాక్టర్ సాబ్ కి పెళ్లి చేసే బాధ్యత నాది అని అనడంతో జ్వాలా మరింత కోపంతో రగిలిపోతూ హిమను బయటకు గెంటేస్తుంది.
రేపటి ఎపిసోడ్ లో హిమ రాత్రంతా ఇంటికి వెళ్లకుండా జ్వాలా ఇంటి ముందే అలాగే నిలబడి ఉంటుంది. అప్పుడు జ్వాల ఇలా చెబితే నువ్వు వినవు పదా అని చెప్పి హిమను కారులో ఎక్కించుకొని సౌందర్య ఇంటి దగ్గర దిగబెడుతుంది. అప్పుడు హిమ లోపలికి వెళ్దాం పద అని ఎంత బ్రతిమలాడినా కూడా అలాగే వెళ్ళిపోతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World