Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంద్రమ్మ ఇంటికి వెళ్లిన హిమ అక్కడ జ్వాలా తో ముచ్చట్లు పెట్టుకుంటుంది..
ఈరోజు ఎపిసోడ్ లు హిమ, జ్వాలా చేయిపట్టుకుని నువ్వుంటే నాకు ధైర్యం గా ఉంటుంది అని చెప్పి ఆ తర్వాత జ్వాలా ని హత్తుకుంటుంది. అప్పుడు జ్వాలాకి ఏం చేయాలో అర్థం కాక అలాగే ఉండిపోతుంది. అప్పుడు జ్వాలా హిమ ను ఏమైంది తింగరి ఎలా చేస్తున్నావు అని అంటుంది.
మరొకవైపు స్వప్న కార్తీక్, దీప ల చావుకి కారణం సినిమానే అన్న విధంగా ఆనందరావు తో మాట్లాడుతూ ఉండగా, అప్పుడు ఆనందరావు స్వప్న మాటలకు మండి పడతాడు. కూతురు కోడలు చనిపోయారు, కొడుకు ఆదిత్య అమెరికా కి వెళ్ళిపోయాడు. మనవరాలు ఒకరు ఉంటే ఇంకొకరు లేరు.
ఉన్న ఒక్కగానొక్క కూతురు కూడా దూరంగా ఉంటుంది అని బాధపడతాడు ఆనందరావు. అప్పుడు స్వప్న డాడీ ఉన్నదాంట్లో ఆనంద పడాలి అని చెప్పడంతో, అప్పుడు ఆనందరావు నువ్వు నా వయసు వచ్చేసరికి ఏకాకి అయిపోతావు అని అంటాడు. మరొకవైపు ఇంద్రమ్మ, జ్వాలా తో కలిసి హిమ భోజనం చేస్తూ ఉంటుంది.
అప్పుడు హిమ సరిగ్గా భోజనం చేయడం లేదని సౌర్య గోరుముద్దలు తినిపిస్తూ ఉంది. సౌర్య, జ్వాలా ఇద్దరూ ఒకటే అని తెలుసుకున్న హిమ జ్వాలా కి మరింత దగ్గర ఇవ్వాలి అని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక వారిద్దరు నవ్వుకుంటూ ఉండడం చూసి ఇంద్రమ్మ దంపతులు వీళ్ళు అక్కాచెల్లెళ్ల అనిపిస్తున్నారు అని అనడంతో జ్వాలా సీరియస్ అవుతుంది.
అప్పుడు హిమ కు పొలమారగ సౌర్య నీళ్లు తాగిస్తుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన హిమ జ్వాలా ఫొటో చూస్తూ మురిసిపోతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World