Banjarahills Pub Case : బంజారాహిల్స్ ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పబ్ పై దాడి ఘటనకు రెండు వారాల ముందే పబ్ కు డ్రగ్స్ సప్లై అయినట్లు పోలీసులు గుర్తించారు. పుడింగ్ అండ్ మింక్ పబ్ లో లేట్ నైట్ పార్టీ జరుగుతున్నట్లు మరో పబ్ యాజమాన్యం నుంచి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ సమాచారం ఆధారంగానే పోలీసులు దాడులు జరిపి డ్రగ్స్ ని గుర్తించారు. ఒక్కో హ్యాష్ ఆయిల్ సిగరెట్ రూ.8 వేల చొప్పున విక్రయించినట్లు తెలిసింది.

కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వీర మాచినేని అర్జున్, కిరణ్ రాజులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీరు విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే నగర పోలీసులు కిరణ్ రాజుకు ఈ మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. పబ్ లో డ్రగ్స్ దొరికిన సమయంలో తాను అమెరికాలో ఉన్నానని కిరణ్ రాజు తెలిపినట్లు సమాచారం. అలాగే తనకు పబ్ లో పార్టనర్ షిప్ మాత్రమే ఉందని… అక్కడి కార్యకలాపాలకు తనకు ఏ సంబంధం లేదని వివరించాడు.
Read Also : Sonam Kapoor : సోనమ్ కపూర్ ఇంట్లో చోరీ.. కోటిన్నర వరకు స్వాహా!