Guppedantha Manasu june 24 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దేవయాని, జగతి మహేంద్ర లు స్లమ్ ఏరియాలో తిని వచ్చారు అంటూ వారిని అవమానిస్తుంది.
ఈరోజు ఎపిసోడ్ లో జగతి, మహేంద్ర లు దేవయాని అన్న మాటలను తలుచుకుని బాధ పడుతూ ఉంటారు. అప్పుడు మహేంద్ర ఎవరు చేసిన తప్పులు వారు అనుభవించక తప్పదు అంతకు రెండింతలు అనుభవిస్తారు అని చెబుతాడు. అప్పుడు జగతి ఇప్పటికే రిషి వసు, ,సాక్షి నా విషయంలో చాలా బాధపడుతున్నాడు.
![Guppedantha Manasu june 24 Today Episode](https://tufan9.com/wp-content/uploads/2022/06/Collage-Maker-24-Jun-2022-10.41-AM.jpg)
ఇప్పుడు దేవయాని చూపిస్తున్నది కూడా కపట ప్రేమ అని తెలిస్తే రిషి ఏమైపోతాడో అని జగతి బాధపడుతుంది. మరొకవైపు వసు దారిలో వెళ్తూ ఉండగా సైకిల్ టైర్ పంచర్ అవ్వడంతో అటుగా వెళ్తున్న రిషి అది చూసి అక్కడికి వచ్చి కాసేపు వసుని ఆట పట్టించినట్లుగా మాట్లాడతాడు.
ఆ తర్వాత వారిద్దరూ క్యారెక్టర్ చేంజ్ చేసుకుని సరదాగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు వసు, రిషి లాగా మాట్లాడుతూ కారులోకి వెళ్లేలా చేస్తుంది. ఆ తరువాత వారిద్దరూ కార్లో వెళ్తూ ఉండగా వసు టీ తాగుదాము అని చెప్పడంతో కారు పక్కగా ఆపి తాగి వెళతారు. ఆ తర్వాత రిషి ఇంటికి వెళ్లగానే మహేంద్ర ఎదురు పడతాడు.
అప్పుడు రిషి ఎక్కడికి వెళ్ళావు? ఏం జరిగింది? ఎందుకు ఇంత లేట్ అయింది ఇలాంటి ప్రశ్నలు అడగవద్దు అని అనగా వెంటనే మహేంద్ర నన్ను ఏదైనా అడగాల్సింది ఉందా అని అనటంతో వెంటనే రిషి తిన్నారా అని అనడంతో లేదు నీ కోసం వెయిట్ చేస్తున్నా అని మహేంద్ర అనటంతో థాంక్స్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి.
ఇక వారి మాటలు విన్న జగతి ఆలోచనలో పడుతుంది. ఆ తర్వాత జగతి భోజనం సిద్ధం చేయగా ఇంతలో అక్కడికి దేవయాని వచ్చి నువ్వు రిషికి భోజనం వడ్డించే వద్దు అని చెప్పి రిషికి భోజనం వడ్డిస్తుంది. భోజనం చేసిన రిషి వంటలు బాగున్నాయి అనడంతో అప్పుడు దేవయాని నేనే వంటలు చేశాను అంటూ తన గురించి తాను చెప్పుకుంటుంది. కానీ జగతి మాత్రం సంతోష పడుతూ ఉంటుంది. ఆ తర్వాత దేవయాని, సాక్షి గురించి మాట్లాడడం తో రిషి భోజనం చేయకుండా మధ్యలో నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు జగతి చాలా బాధపడుతుంది.
Read Also : Guppedantha Manasu june 23 Today Episode : వసు జ్ఞాపకాలతో సతమతమౌతున్న రిషి.. దేవయాని మాటలకు బాధపడుతున్న జగతి, మహేంద్ర..?