Pitru Paksha: మహాలయ అమావాస్య, పితృ పక్షం, పెత్తర అమావాస్య, పెద్దల అమావాస్య… ఇలా పేర్లు వేరైనా ఇవన్నీ ఒక్కటే. ప్రతి ఏటా భాద్రపద మాసంలో శుక్లపక్ష పౌర్ణమి నుంచి అశ్విని మాసం వరకు ఉండే అమావాస్యనే పితృ పక్షం అంటారు. తమను వదిలి వెళ్లిన తల్లిదండ్రులు పూర్వీకులను తలచుకొని పితృ పక్షంలో వారికి పూజలు చేస్తారు. తమను విలి వెళ్లిన తల్లిదండ్రులు పూర్వీకులను తలచుకొని పూజలు చేస్తారు. తద్వారా పితృ దేవతల అనుగ్రహం కల్గి పితృదోష విముక్తి జరుగుతుంది. ఈ ఏాది పితృ పక్షం ఎప్పుడు వస్తుంది, దేవతల అనుగ్రహం కోసం ఏం చేయాలి తదితర అంశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఏడాది సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకు పితృ పక్షం ఉంటుంది. ఈ 15 రోజుల్లో తిథి ప్రకారం తమ పితృ దేవతలను పూజించాలి. ఏ తిథిలో చనిపోతే ఆ తిథి నాడు పితృ దేవతలను పూజించాలి. తద్వార సంతాన లేమి వంటి సమస్యలు తొలగుతాయి. పితృ పక్షంలో కొత్త ఇల్లు కొనుగోలు, వాహన కొనుగోలు, గృహ ప్రవేశం, క్షవరం, కొత్త దుస్తులు ధరించడం వంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయద్దు. అలాగే మాంసాహారాన్ని భుజించవద్దు. ఆహారంలో వెల్లల్లిని తీసుకోవద్దు. పితృపక్షంలో పితృ దేవతల ఆత్మకు శాంతి చేకూర్చేందుకు పిండ దానం, శ్రాద్ధం నిర్వహిస్తారు. నదీ స్నానం ఆచరించి జలచరాలకు లేదా కాకులకు పిండదానం చేయడం ద్వారా పితృదో విమోచనం కల్గుతుంది.