Viral Video : రామానంద్ సాగర్ రామాయణం 80వ దశకం చివరిలో అత్యంత ప్రజాదరణ పొందిన పౌరాణిక దారావాహికలలో ఒకటి. ఎంతగా అంటే.. శ్రీరాముడు, సీత, లక్ష్మణ్‌లను పోషించే ప్రధాన పాత్రలు దేవుళ్లకు పర్యాయపదాలుగా చెప్పవచ్చు. 2020లో లాక్‌డౌన్ కారణంగా రామాయణం మళ్లీ టీవీల్లోకి వచ్చింది. పౌరాణిక దారావాహికలో ప్రధాన నటుడు, అరుణ్ గోవిల్ (Arun Govil) శ్రీరాముని పాత్రలో నటించారు.

అప్పటినుంచి ఆయన్ను చాలామంది శ్రీరామునిగానే భావిస్తున్నారు. ఇప్పటికీ తనను రామ్ అని చాలామంది పిలుస్తారని తరచుగా గోవిల్ చెబుతూ ఉంటారు. ఎయిర్ పోర్టులో గోవిల్ నిలబడి ఉండగా ఓ మహిళ భావోద్వేగానికి గురై అతని కాళ్ళపై పడిపోయింది. ఆశ్చర్యపోయిన అరుణ్ గోవిల్ ఆమెను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించడం వీడియోలో కనిపించింది.
రామానంద్ సాగర్ రామాయణంలో శ్రీరామునిగా నటించిన ప్రముఖ నటుడు అరుణ్ గోవిల్ తన కుటుంబంతో కలిసి విమానాశ్రయంలో కనిపించాడు. ఆయన్ను చూడగానే మహిళ భావోద్వేగానికి లోనైంది. వెంటనే ఆయన కాళ్లపై పడి శ్రీరామ అంటూ సాష్టాంగ నమస్కారం చేసింది. ఆమె పక్కనే ఉన్నా మహిళ భర్తను ఆపమని అరుణ్ గోవిల్ సైగ చేయడం కనిపించింది. ఆ తర్వాత ఆ మహిళ మెడలో పసుపు రంగు దుపట్టా వేసి దీవించాడు. గత నెల 30వ తేదీన ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించి వీడియోను ఐఏఎస్ అధికారి డాక్టర్ సుమిత్ర మిశ్రా తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video : అరుణ్ గోవిల్ కాళ్లపై పడిపోయిన మహిళ.. దుపట్టా కప్పి దీవించిన గోవెల్

1987 పౌరాణిక కార్యక్రమం రామాయణంలో శ్రీరాముని నామమాత్రపు పాత్రను పోషించిన అరుణ్ గోవిల్.. నేను రామ్ కోసం ఆడిషన్ ఇచ్చానని గుర్తుంచుకోండి. నేను మొదట్లో విఫలమయ్యాను. ఏమి జరిగిందో నాకు తెలియదు. ఫోటోషూట్ లుక్, మేకప్‌తో జరిగింది. కానీ నేను రాముడిలా కనిపించడం లేదన్నారు. అయితే ఒకప్పుడు అరుణ్ గోవిల్ తన కెరీర్ దాదాపు ముగిసిపోయిందని అనుకున్నాడు. రామాయణం తర్వాత నా సినిమా కెరీర్ దాదాపు ముగిసిపోయింది. ఇంతకు ముందు సినిమాలు చేస్తున్నా.. కానీ ఇమేజ్ బలంగా ఉండడంతో ఆ సినిమాలు రాలేదు.
आपकी छवि क्या है औरों के हृदय में उससे ही आपकी महानता है।रामायण टीवी धारावाहिक को 35 वर्ष हो गए पर राम का चरित्र निभाने वाले अरुण गोविल आज भी सबके लिए प्रभु श्रीराम ही हैं। भावुक कर देने वाला क्षण। @arungovil12 pic.twitter.com/4nM979xQl3
Advertisement— Dr Sumita Misra IAS (@sumitamisra) September 30, 2022
Advertisement
సీరియల్స్‌లో నటించి ఆ ఇమేజ్ నుంచి బయటికి రావాలని ప్రయత్నించాను. అలా చేయలేకపోయానని గోవిల్ చెప్పుకొచ్చాడు. బహుశా భగవంతుడు నన్ను రామ్‌గా ఉండాలనుకుంటున్నాడని, ఎంతమందికి ఈ అరుదైన అవకాశం ఇచ్చాడో ఆ తరువాత గ్రహించానని తెలిపాడు. ప్రజలు తనను అరుణ్ గోవిల్ అని పిలవరని, నన్ను రామ్ అని పిలుస్తారని, వారి దృష్టిలో నేను దేవుడననే విశ్వాసం బలంగా ఉందని, అది తన అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. రామాయణం టీవీ సీరియల్ వచ్చి 35 ఏళ్లు దాటిపోయింది. ఇప్పటికీ రాముడి పాత్రలో అరుణ్ గోవిల్ టీవీ ప్రేక్షకుల్లో గుండెల్లో శ్రీరాముడిగానే కొలువై ఉండిపోయాడు.
Read Also : Viral Video : వామ్మో.. అరటి పండు కదాని పట్టుకున్నాడు.. ఆ తర్వాత ఏమైందో మీరే చూడండి.. షాకింగ్ వీడియో!