Viral Video : సాధారణంగా పాములు ఇళ్లలోకి, ఇంటి ప్రాంగణాల్లోకి వస్తుంటాయి. ఎక్కువగా ఎలుకలు ఉండే ప్రదేశాల్లో పాములు బాగా సంచరిస్తూ ఉంటాయి. ఎలకల కోసం పాములు వచ్చి వాటిని తింటాయి. ఈ పాము మహిళ చెవిలోకి ఎలా ప్రవేశించిందో తెలియడం లేదు. లేదా ఎవరైనా కావాలనే అలా చేశారా? అనేది కూడా తెలియడం కొన్నిసార్లు.. మన ఇళ్లలోకూడా సర్పాలు దర్శనం ఇస్తూ ఉంటాయి. అప్పుడు మనం పామును చూస్తేనే వామ్మో అని భయమేస్తుంది. ఎక్కడో దూరంగా ఉన్న పామును చూసిన భయంగా అనిపిస్తుంది. అలాంటిది ఓ పాము ఏకంగా మహిళ చేవిలోకి దూరింది. అది ఆమె చెవిలోకి ఎలా దూరిందో తెలియదు కానీ, చెవిలి ఇరికిన పాము బయటకు రాలేక చెవిలోనే ఉండిపోయింది. పాము పిల్ల తన చెవిలోకి ఎప్పుడు దూరిందో ఆ మహిళకు తెలియదు. నిద్రిస్తున్న సమయంలో ఆమె చెవిలోకి ఆ పాము దూరి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
ఆ మహిళకు ఉన్నట్టుండి చెవిపోటు రావడంతో వైద్యుని దగ్గరకు వెళ్లింది. భరించలేనంత నొప్పి వస్తుండటంతో ఏదైనా పురుగు వెళ్లి ఉంటుందని అనుకుంది. ఆస్పత్రిలో వైద్యులు ఆమెను పరీక్షించి అనంతరం షాకయ్యారు. చెవిలో పాము ఉండటం చూసి నివ్వెరపోయారు. అదేంటి అంతపెద్ద పాము చెవిలోకి ఎలా దూరి ఉంటుందని ఆశ్చర్యపోతున్నారు. ఏదోలా ఆ మహిళ చెవిలో నుంచి ఆ పామును బయటకు తీసేందుకు వైద్యులు కొన్ని గంటల పాటు శ్రమించారు. చెవి లోపల నక్కిన పామును బయటకు తీసే క్రమంలో ముందుగా పాము తలను బయటకు లాగారు. ఆ పాము చూడటానికి పచ్చగా కొండచిలువ పిల్ల మాదిరిలా ఉంది. ఆ పాము నోరు తెరిచినప్పుడు దాని నోట్లో పళ్లు రంపంలా ఉన్నాయి. అదృష్టవశాత్తూ ఆ పాము విషం లేనిది కావడంతో ప్రాణాలు దక్కాయి. లేదంటే ఆ పాము కాటుకు ఆ మహిళ ప్రాణాలు కోల్పోయేది.
Viral Video : మహిళ చెవిలో దూరిన పాము వీడియో వైరల్…
పామును బయటకు లాగేందుకు వైద్యులు.. ప్లక్కరు పట్టుకుని బయటకు లాగేందుకు ప్రయత్నించారు. ఆ పాముకి మత్తు కూడా ఇచ్చారు. ఒకపక్క మహిళ నొప్పి భరించలేక విలవిలాడిపోతుంది. పాము బయటకు రాలేక చెవులోనే ఇరుక్కుపోయింది. ఈ క్రమంలో వైద్యులు ఆ పామును బయటకు లాగేందుకు ప్రయత్నించడాన్ని వీడియోలో చూడవచ్చు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియలేదు. చందన్ సింగ్ అనే ఫేస్ బుక్ యూజర్ ఈ వీడియోను పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. అసలు పాము మహిళ చెవిలోకి ఎలా దూరిందంటూ కామెంట్లు చేస్తున్నారు.
Read Also : Niharika Konidela : శ్రీజ బాటలో నిహారిక.. మెగా డాటర్ భర్తను నిజంగానే దూరం పెట్టేసిందా?!