Viral Video: ప్రస్తుత కాలంలో ఏ చిన్న వింత సంఘటన జరిగిన, వెంటనే ఆ ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ క్షణాల్లో వాటిని వైరల్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఇలాంటి ఫన్నీ వీడియోలు పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా పెళ్లికి సంబంధించిన వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతూ ఎంతోమందిని ఆకట్టుకున్నాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే నిశ్చితార్థం జరుపుకుంటున్నటువంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోలో భాగంగా అమ్మాయి వరుడు చేతికి ఉంగరం ధరించి అనంతరం తన కాళ్లకు నమస్కరిస్తోంది. అయితే ఈ విధంగా తనకు కాబోయే భర్త కాళ్లకు నమస్కరించడం కొన్నిచోట్ల ఆనవాయితీగా ఆచారంగా వస్తోంది.అయితే ఇలా అమ్మాయి అబ్బాయి చేతికి ఉంగరం తొడిగే సాంప్రదాయబద్దంగా తన కాళ్లకు నమస్కరించిన అనంతరం తర్వాత అబ్బాయి వంతు వచ్చింది. ఈ క్రమంలోనే అబ్బాయి కూడా అమ్మాయి చేతి వేలికి ఉంగరం తొడిగారు. ఇక్కడి వరకు అంతా బాగున్న ఒక్కసారిగా వరుడు అమ్మాయి ఏ విధంగా తన కాళ్లకు నమస్కారం చేసిందో అబ్బాయి కూడా అలాగే అమ్మాయి కాళ్లకు నమస్కారం చేయడానికి వంగారు.
AdvertisementView this post on Instagram
AdvertisementAdvertisement
ఇలా అబ్బాయి కూడా అమ్మాయి కాళ్ళకు దండం పెట్టడంతో ఒకేసారి పవిత్ర బంధం సినిమాలోని సన్నివేశం కళ్లకు కట్టినట్టుగా చూపించారు.ఈ విధంగా వరుడు వంగడంతో ఒక్కసారిగా తన పక్కనే ఉన్న తన తండ్రి తన పై ఒకటి వేసి తనను పైకి లేపాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొంతమంది ఈ వీడియో పై స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వీడియో షేర్ చేసిన అతి తక్కువ సమయంలోనే ఎక్కువ సంఖ్యలో లైఫ్ కామెంట్ల వచ్చాయి.
Read Also : Sarkaru Vari Pata : అదేంటో భయ్యా.. నాలుగేళ్లుగా ఏది పట్టుకున్నా ఇట్టే హిట్ అయిపోతోంది.. మహేష్ కామెంట్స్!
Tufan9 Telugu News And Updates Breaking News All over World