Viral Video: సాధారణంగా కొన్ని సాహసాలు ప్రమాదకరమని తెలిసినప్పటికీ కొందరు అలాంటి సాహసాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు.అయితే ఇలాంటి సాహసాలు చేస్తున్న సమయంలో ఒంట్లో వణుకు బెదురు ఎదురు తప్పనిసరిగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా తండ్రి కొడుకులు చేపల వేట కోసం వెళ్లారు. ఈ చేపల వేటలో భాగంగా కొడుకు పెద్ద చేప పడటంతో ఆ చేపను ఒడ్డుకు చేరుస్తున్నారు.
ఈ క్రమంలోనే 4 అడుగుల పొడవు గల పెద్ద మొసలి ఆ చేపను వెంటాడుతూ వచ్చింది. ఈ విధంగా ముసలి రావడంతో ఆ కుమారుడు చేపను త్వరగా ఒడ్డుకు చేర్చారు. అయితే చేపను ఒడ్డుకు చేరుస్తున్న క్రమంలో అతను పెట్టుకున్న టోపీ కిందకు పడిపోయింది. ఇక అదే సమయంలో ముసలి కూడా దాదాపు ఒడ్డుకు చేరుకుంది. అయితే తన కొడుకు టోపీ కింద పడిపోవడంతో అడుగు దూరంలో చావు ఉందని తెలిసినా కూడా ఆ తండ్రి టోపీ కోసం ముందుకు కదిలాడు.
View this post on Instagram
అయితే వెంటనే ముసలి బారిన పడకుండా టోపీ అందుకున్నారు. ఈ విధంగా ఒక అడుగు దూరంలో ముసలి రూపంలో చావు ఉందని తెలిసిన ఆయన ఎంతో ధైర్యం చేశారు. ఇలా విజయవంతంగా టోపీ అందుకొని రావడంతో ఇకపై ఇలాంటి సాహసాలు చేయకూడదని తండ్రీకొడుకులు భావించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Tufan9 Telugu News And Updates Breaking News All over World