AP News: సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఆడపిల్లకు ఒకేసారి పెళ్లి చేయడం ఆచారం.అయితే కొన్నిసార్లు అనుకోకుండా భర్త చనిపోతే ప్రస్తుతకాలంలో రెండవ వివాహం కూడా కొందరు మాత్రమే చేసుకుంటూ ఉన్నారు.కానీ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో గిరిజనులు మాత్రం ఇంట్లో ఆడపిల్ల ఉంటే మూడుసార్లు పెళ్లిళ్లు చేయడం ఇక్కడ ఆచార సంప్రదాయంగా వస్తోంది. అమ్మాయి పుట్టిన ఐదేళ్లలోపు ఒకసారి, యుక్త వయసు రాగానే మరొకసారి, అలాగే పెళ్లీడుకొచ్చిన తర్వాత మరోసారి పెళ్లి చేస్తారు.
ఒడిశా సరిహద్దుల్లోని మాలీస్ తెగ నివసించే గ్రామాలలో ప్రజలు వారి ఇంటిలో జన్మించిన ఆడపిల్లలకు ఇలా మూడు సార్లు పెళ్లి చేయడం ఆనవాయితీ. అయితే మొదటి రెండు సార్లు చేసే వివాహానికి వరుడు ఉండరు. మూడవసారి చేసే వివాహంలో మాత్రమే వరుడు ఉంటారు.ఈ విధంగా అక్కడ ప్రతి ఒక అమ్మాయికి మూడు పెళ్లిళ్లు చేయడం ఆనవాయితీగా కొనసాగుతూ వస్తోంది. ఈ విధంగా ప్రతి అమ్మాయికి మూడు పెళ్లిళ్లు చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే…
ఈ గిరిజనులు వారి ఇంటిలో అమ్మాయి పుడితే సంబరాలు చేసుకుంటారు.సాక్షాత్తు వారిని దేవతగా భావించి వారిని ఎంతో గౌరవంగా చూసుకుంటారు.అలాగే ఆడపిల్ల విషయంలో పెళ్లి అనేది ఎంతో ముఖ్యం కనుక ఆ అమ్మాయి పెరిగి పెద్ద అయి పెళ్లి వయసుకు వచ్చేలోగా తమ తల్లిదండ్రులు చనిపోవచ్చు.తమ కూతురు పెళ్లి చూడలేకపోయాను అనే బాధ వారిలో ఉండకుండా వారి తాతల ముత్తాతల కాలం నాటి నుంచి ఇలాగే ఆడపిల్ల పుడితే వారికి మూడుసార్లు పెళ్లి చేయడం ఆనవాయితీగా వస్తోంది.
సాధారణంగా ఒక పెళ్లి చేస్తే ఎలాగైతే బంధువులను అందరినీ ఆహ్వానిస్తామో ఇలా అమ్మాయిలకు మూడు సార్లు పెళ్లి చేసినప్పుడు కూడా తమ బంధువులు అందరినీ ఆహ్వానించి పెద్ద ఎత్తున పండుగలా జరుపుకుంటారు. ఊరు మొత్తం విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు.గ్రామ పెద్దలు అందరూ కలిసి ఆ గ్రామంలో ఎంతమంది పిల్లలు పెళ్లి వయసుకు వచ్చారు అని నిర్ణయించి ఒక్కరోజు సామూహిక వివాహాలు చేస్తారు. ఏమాత్రం హంగు ఆర్భాటాలకు తగ్గకుండా సాధారణ పెళ్లి చేసిన విధంగానే అన్ని ఏర్పాట్లు చేసి ఈ పెళ్లిళ్లను కూడా లక్షలు ఖర్చు చేసి నిర్వహిస్తారు.ఇక రెండు సార్లు ఈ విధంగా పెళ్లి చేసుకున్న తర్వాత మూడవసారి వరుడితో అమ్మాయి పెళ్లి జరిపిస్తారు. అయితే ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించిన కాదనకుండా వారికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇప్పటికీ ఇక్కడ ఈ ఆచారం కొనసాగుతుందని గిరిజన గ్రామస్తులు వెల్లడించారు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World