Vikky the rock star: సీఎస్ గంటా దర్శకత్వంలో వైవిధ్యభరితమైన కథతో రాబోతున్న కొత్త సినిమా విక్కీ ద రాక్ స్టార్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాలో విక్రమ్ అమృత చౌదరి ముఖ్య పాత్రలు పోషించారు. హై ప్రొడక్షన్ వాల్యూస్ జోడించి శ్రీమతి వర్ఘిని నూతలపాటి సమర్పణలో స్టూడియో87 ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సుభాష్, చరిత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా బాధ్యతలు చేపట్టారు. అయితే విక్కీ ది రాక్ స్టార్ ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ షేడ్ కు మంచి స్పందన వచ్చింది. సినిమా మీద పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ప్రేమలోని మాధుర్యాన్ని చూపించేలా లవ్ షేడ్ ను విడుదల చేశారు.
ఎంత బాగుందో… ఇలా నీ పక్కన ఉండటం, ఎంత థ్రిల్లింగ్ గా ఉంది… ఔ వాంట్ టు స్టే ఫరెవర్.. అంటూ సాగే ఈ లవ్ షేడ్ తో ప్రమేకు సంబంధించిన సన్నివేషాలను చూపించారు. ఇందులో రొమాంటిక్ సీన్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇందులో సునీల్ కశ్యప్ మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించారు. గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్, ఇతర వివరాలు ప్రకటించనున్నారట.