...

Vignesh-nayan wedding : ఒక్కటైన నయన్, విఘ్నేష్ లు.. నెట్టింట వైరల్ అవుతున్న పెళ్లి ఫొటోలు!

Vignesh-nayan wedding : ఎట్టకేలకు విఘ్నేష్ శివన్, నయన తార ఒక్కటయ్యారు. ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్న వీరు ఈరోజు వేద మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. సినీ, రాజకీయ ప్రముకులు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య తమిళనాడులోని మహాబలిపురం షెరిటన్ హోటల్ లో వీరి వివాహం జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం అత్యంత వైభోవోపేతంగా వీరి పెళ్లి జరిగింది. అయితే ఈ ఫొటోలను విఘ్నేష్ శివన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

Vignesh-nayan wedding
Vignesh-nayan wedding

నాను రౌడీదాన్ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ ఈ లవ్ బర్డ్స్ గత లాక్ డౌన్ లో సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ మధ్య అన్ని పుణ్య క్షేత్రాలు తిరిగొచ్చిన ఈ జంట ఈరోజు తమ జీవితంలో పెళ్లి పుస్తకాన్ని తెరిచారు. ఎంతగానో ఆరాధించే నటుడు రజనీకాంత్ చేతుల మీదుగా అందుకున్న మంగళ సూత్రాన్ని విఘ్నేష్… నయన తార మొడలో కట్టాడు.

ఆ సందర్భాన్ని విఘ్నష్ సోషల్ మీడియాలో వివరించాడు. నయన్ మేడమ్ నుంచి కాదంబరి, కాదంబరి నుంచి తంగమే, తంగమే నుంచి నా బేబీ, నా బేబీ నుంచి నా ఉయిర్, నా ఉయిర్ నుంచి కన్మణి, కన్మణి నుంచి నా భార్యగా మారావు అంటూ లవ్ సింబల్ ఎమోజీలు పెట్టాడు. వీటితో పాటు పెళ్లి ఫొటోలను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.


Read Also : Nayanathara vignesh wedding : నయన్-విఘ్నేష్‌ల పెళ్లి ఆహ్వానం.. వెడ్డింగ్ కార్డు వీడియో వైరల్..!