Guppedantha Manasu Nov 5 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసుధార రిషి ఇద్దరు దీపాలు వెలిగిస్తూ ఒకరి వైపు ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో రిషి వసుధార తో మాట్లాడుతూ నా ఒంటరితనాన్ని దూరం చేశావు. నా జీవితాన్ని ఈ ప్రమిదల లాగా వెలిగించావు అని అనగా వెంటనే వసుధార ఎందుకు సార్ అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అనడంతో లేదు వసుధార ఈపాటికి నువ్వు లేకపోయి ఉంటే ఈ పరిస్థితులలో నేను ఏమయ్యో వాడిన ఊహించుకుంటేనే భయం వేస్తోంది అంటాడు రిషి.

Guppedantha Manasu Nov 5 Today Episode
అప్పుడు వసుధార రిషి చేతులు పట్టుకొని నేను ఉన్నాను సార్ అంటూ ధైర్యం చెబుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత వసుధార ఆకాశానికి మొక్కుకుందాం అనగానే సరే అని వాళ్ళిద్దరూ మొక్కుకుంటూ ఉండగా ఇంతలోనే అనుకోకుండా వసుధార కింద పడిపోతూ ఉండగా రిషి పట్టుకుంటాడు. ఆ తర్వాత వాళ్లు ఒకరినొకరు చూసుకుంటూ అలాగే ఉంటారు.
మరొకవైపు మహేంద్ర ఆలోచిస్తూ ఉండగా ఇంతలో జగతి అక్కడికి వచ్చి ఏం ఆలోచిస్తున్నావు మహేంద్ర అనగా నా ఆలోచనలు నా ఊహలు అని రిషి అని అంటాడు. అప్పుడు జగతి మహేంద్ర నువ్వు మొదటి సంతోషంగా ఉంటేనే రిషి సంతోషంగా ఉంటాడు అని అంటుంది. అప్పుడు జగతి మహేంద్ర ను బ్రతిమలాడుతూ ఉండగా వెంటనే మహేంద్ర ఈ గొడవల్లో మర్చిపోయి నా భార్యను జాగ్రత్తగా చూసుకోవడం మర్చిపోయాను అంటూ జగతి కి గోరుముద్దలు తినిపిస్తాడు మహేంద్ర.
అప్పుడు జగతి ఎమోషనల్ అవుతూ నన్ను రిషి అమ్మ అని పిలవకపోయినా పర్లేదు కానీ నా మూలంగా వసుధార, రిషి ల బంధం బీటలు వారకూడదు మహేంద్ర అని అంటుంది. మరొకవైపు వసుధార సంతోషంతో కిందికి వస్తూ ఉండగా దేవయాని అడ్డుపడి ఎక్కడికి నుంచి వస్తున్నావు అనడంతో మేడ పైనుంచి అని అంటుంది వసుధార. రిషి కూడా ఉన్నాడా అనగా అవును అని అంటుంది వసు.
Guppedantha Manasu Nov 5 Today Episode : వసుధారను రెచ్చగొట్టిన దేవయాని..
అప్పుడు దేవయాని ఈ టైంలో మేడపైన చీకట్లో ఏం పని నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని అనడంతో వెంటనే వసుధార సీరియస్ అవుతూ మేడం మీ భాషను మార్చుకోండి మీరు పెద్దవారు అని సీరియస్ అవుతుంది. ఇలా మాట్లాడితే ఊరుకోను అని అనగా ఏం చేస్తావు అని దేవయాని రెచ్చగొట్టడంతో మీరు మాట్లాడిన మాటలు అన్నీ వెళ్లి రిషి సార్ కి చెబుతాను అని అంటుంది. ఆ మాటలకు దేవయాని ఒక్కసారిగా షాక్ అవుతుంది.
అప్పుడు వసుధార ఒక మాట చెప్తా గుర్తుపెట్టుకొని రిషి సార్ నా వాడు సార్ తో కలిసి జీవితాంతం ప్రయాణిస్తాను. అని దేవయానికి తగిన విధంగా బుద్ధి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వసుధార. మరొకవైపు రిషి గదిలో ఒంటరిగా పడుకొని వసుధార అన్న మాటలు గుర్తుతెచ్చుకొని సంతోష పడుతూ ఉంటాడు. ఈ పొగరు ఏం చేస్తోంది అని అనుకుంటూ ఉండగా మరొకవైపు వసుధార ఫోన్లో రిషి ఫోటో చూస్తూ మురిసిపోతూ ఉంటుంది.
ఇంతలోనే రిషి ఏం చేస్తున్నావు నిద్రపోతున్నావా అని మెసేజ్ చేస్తాడు. అలా వారిద్దరూ చాటింగ్ చేసుకుంటూ ఒకరికి తెలియకుండా ఒకరు రూమ్ లో నుంచి బయటకు వచ్చి ఒక చోట నిలబడి తలకు తల డాష్ ఇచ్చుకుంటారు. ఆ తరువాత వాళ్ళు నవ్వుకుంటూ ప్రేమగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరొకవైపు జగతి గౌతమ్ కి ఫోన్ చేసి మేము ఒక డిసిషన్ తీసుకున్నము గౌతమ్ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాము సరే అంటాడు గౌతమ్.
ఆ తరువాత జగతి మహేంద్ర రిషికంట పడకుండా మినిస్టర్ గారిని కలిసి వచ్చేయాలి అని అనుకుంటూ అక్కడ నుంచి బయలుదేరుతారు. ఆ తర్వాత వసధార రెడీ అవుతూ ఉండగా ఇంతలోనే రిషి అక్కడికి వెళ్తాడు. అప్పుడు హెయిర్ డ్రైయ్యర్ తో తలని ఆర్పుతూ ఉండగా అప్పుడు ఏం చేస్తున్నారు సార్ మీరు అంటూ వసుధార రిషి ని పట్టుకుంటూ ఉండగా వారిద్దరూ కాసేపు గొడవ పడుతూ ఉంటారు. ఇద్దరు ఫన్నీగా గొడవ పడుతూ ఒక సోఫాలో ఒకరి మీద ఒకరు పడతారు.
Read Also : Guppedantha Manasu Nov 4 Today Episode : రిషి వసు మధ్య రొమాంటిక్ సీన్.. రిషి మాటలకు షాక్ అయిన దేవయాని..?