#Govt Jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs

, ,

Guppedantha Manasu january 05 Today Episode : వసు ఇంటి నుంచి వెళ్లిపోయిన జగతి, మహేంద్ర.. వసు మెడలో తాళిబొట్టు చూసి షాకైన రాజీవ్?

By Ramesh Babu

Published on: January 5, 2023 7:12 AM

Updated on: January 7, 2023 12:39 PM

Follow Us

vasudhara gets emotional in todays guppedantha manasu serial episode

---Advertisement---

Guppedantha Manasu january 05 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్లో వసుధార రిషిని ఇంటి నుంచి వెళ్లిపోమని చెబుతుంది.

ఈరోజు ఎపిసోడ్ లో వసుధార చేతులు జోడించి ఏడుస్తూ దయచేసి వెళ్ళిపోండి సార్ అనడంతో రిషి షాక్ అవుతాడు. అప్పుడు రిషి వసుధారని పట్టుకొని నన్ను వెళ్ళమంటున్నావా వసు అని అనగా అదే కదా సార్ చెబుతోంది అని రాజీవ్ అనడంతో నువ్వు మాట్లాడకు అని అంటాడు. అప్పుడు రిషి నిజంగానే నన్ను వెళ్లిపోమని చెబుతున్నావా వసుధార, మనిద్దరం ప్రేమించుకున్నాం కదా పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాను కదా నిన్ను ఎవరైనా బెదిరించారా చెప్పు అని కోపంగా అడగడంతో వెళ్లిపోండి సార్ అంటూ దూరంగా నెట్టేస్తుంది వసుధార. దాంతో రిషి ఒక్కసారిగా షాక్ అవుతాడు.

Guppedantha Manasu january 05 Today Episode
Guppedantha Manasu january 05 Today Episode

దయచేసి వెళ్ళిపోండి మీకు మళ్ళీ చెబుతున్నాను ఇది మా కుటుంబ సమస్య అనడంతో రిషి వసుధార వైపు చూస్తూ ఏడుస్తూ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు రిషి మొఖం చూడలేక వసుధార పక్కకు తిరిగి ఏడుస్తూ ఉంటుంది. అది చూసి రాజీవ్ సంతోష పడుతూ ఉంటాడు. అప్పుడు కోపంతో రగిలిపోతున్న జగతి వసుధార చేయి పట్టుకొని నీకు పిచ్చి పట్టిందా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతుంది. ఈ పెళ్లి ఏంటి నువ్వు పెళ్లికూతురుగా రెడీ అవ్వడం ఏంటి? నీ పెళ్లి గురించి మాట్లాడడానికి ఇక్కడికి రమ్మన్నావు కదా ఎందుకు ఇలా చేస్తున్నావు వసుని కోపంగా నిలదీయడంతో రెండు చేతులు జోడించి మేడం ప్లీజ్ వెళ్ళిపోండి అనగా జగతి షాక్ అవుతుంది.

నన్ను ఏమీ అడగవద్దు అని వసుధార ఏడుస్తూ ఉండగా వెంటనే సీరియస్ అయిన మహేంద్ర మమ్మల్ని వెళ్ళమంటున్నావా రిషి ని వెళ్ళమంటావా గొప్ప కానుక ఇచ్చావు అనడంతో కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది వసుధార. గురుదక్షిణ ఇస్తాను అని చెప్పి చాలా మంచి బహుమతి ఇచ్చావు. వెళ్ళాం పద జగతి ఇంకా ఇక్కడే ఉంటే మెడబట్టి బయటకు గెంటించేలా ఉంది అనడంతో వసుధార మరింత కుమిలిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు చక్రపాణి, రాజీవ్ ఇద్దరు సంతోష పడుతూ ఉంటారు. తర్వాత రిషి కార్లో వెళుతూ వసుధార అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. తర్వాత జగతి వాళ్ళు వసుధార రిషిని తలుచుకొని బాధపడుతూ ఉంటారు.

Guppedantha Manasu జనవరి 05 ఎపిసోడ్ : వసుధార షాక్ 

తర్వాత చక్రపాణి ఇంట్లో పెళ్లి పనులు మొదలవగా రాజీవ్ పూజ చేస్తూ ఉంటాడు. ముహూర్తానికి సమయం అవుతుంది పెళ్లికూతురుని తీసుకురండి అనడంతో సుమిత్ర లోపలికి వెళ్ళగా అక్కడ వసుధార ఏడవకుండా ధైర్యంగా కూర్చుని ఉండడంతో ఏంటమ్మా ఏడుస్తుంటుంది ఎలా తీసుకెళ్లాలి అనుకున్నావు కదా అనగా అదేం లేదు వసు అంటుంది సుమిత్ర. అప్పుడు వసుధార ధైర్యంగా వెళ్లి పెళ్లి పీటల మీద కూర్చుని పూజ చేస్తూ ఉంటుంది. అప్పుడు రాజీవ్ పంతులుగారు మంత్రాలు చాలు మాంగళ్యధారణ జరిపించండి అనడంతో రాజుకి మంగళసూత్రం ఇచ్చి తాళికట్టమని చెబుతాడు. అప్పుడు వసుధార ఆగండి పూజారి గారు నాదొక చిన్న సందేహం.

మెడలో తాళిబొట్టు ఉన్న తర్వాత మరొక తాళి కట్టవచ్చా అనడంతో ఏం మాట్లాడుతున్నావ్ మా అలా చేయకూడదు అని అంటూ అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఏం మాట్లాడుతున్నావ్ వసుధార అనడంతో నిజమే మాట్లాడుతున్నాను బావ అంటూ తన మెడలో ఉన్న తాళిబొట్టును తీసి చూపించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు చక్రపాణి ఏంది జరుగుతుంది సుమిత్ర అని అడుగుతాడు. నువ్వు ఎన్నైనా చెప్పు వసుధార నా దృష్టిలో అది పెళ్లే కాదు. నీకు పెళ్లి జరిగినా పర్వాలేదు నాకు కూడా పెళ్లి జరిగింది. నాకు కూడా ఇది రెండవ పెళ్లి అని అనడంతో వసుధార షాక్ అవుతుంది. అప్పుడు రాజీవ్ వసుధార మెడలో ఉన్న తాళిబొట్టును తెంపడానికి మీదకు వెళుతుండగా బావ దగ్గరికి రావద్దు అని అంటుంది.

అప్పుడు వసుధార చక్రపాణి నాన్న వీడు ఒక దుర్మార్గును అక్కని చంపేశాడు అని చెప్పగా అవును చెప్పేది నిజం అని సుమిత్ర చెప్పడంతో చక్రపాణి మాత్రం రాజీవ్ నేను గుడ్డిగా నమ్ముతూ ఉంటాడు. నిజం ఇప్పుడే నిరూపిస్తాను అని వసుధార లోపలికి వెళ్తుండగా వెళ్లకుండా ఆపుతాడు. అప్పుడు చక్రపాణి కూడా రావడంతో అందరూ ఒకరినొకరు నెట్టుకుంటూ ఉండగా చక్రపాణి పక్కకు వెళ్లి ఒకచోట కింద పడిపోవడంతో తలకు గాయం అవుతుంది. అప్పుడు వసుధార దగ్గరికి రావద్దు బావ అంటూ చేతిలోకి దీపం తీసుకుంటుంది.

Read Also : Guppedantha Manasu: రిషిని ఇంట్లో నుంచి వెళ్లిపోమని చెప్పిన వసుధార.. షాక్ లో జగతి, మహేంద్ర?

, , , , ,

Join our WhatsApp Channel