Guppedantha Manasu Nov 11 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో గౌతమ్ వసుధార గురించి గొప్పగా చెబుతూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో దేవయాని, గౌతమ్, ధరణి వాళ్ళు రిషి వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
అప్పుడు గౌతమ్, వసుధార గురించి పొగుడుతూ పెద్దమ్మ యూనివర్సిటీ టాపర్ రావడం అంటే మాటలా అంటూ పొగుడుతూ ఉండగా గౌతమ్ ఇక ఆపుతావా అని కోప్పడుతుంది దేవయాని. అప్పుడు ధరణి కూడా కావాలనే వసుధార గురించి గొప్పగా మాట్లాడుతూ వుంటుంది. అప్పుడు గౌతమ్,రిషి ఇష్టపడ్డాడు కాబట్టి వసుధారని ఇంటికి రానిస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు.
అప్పుడు ఏంటి ధరణి స్వీట్లు తయారు చేసావా అనగా తయారు చేశాను అత్తయ్య వసుధార రాగానే వెళ్లి స్వీట్ తినిపించాలి అనడంతో స్వీట్ ఏం కర్మ వెళ్ళిపూల దండలు వేయించి ఆహ్వానించు అంటూ వెటకారంగా మాట్లాడుతుంది దేవయాని. ఇంతలోనే అక్కడికి రిషి, వసుధార రావడంతో వసుధార రిషి కోట్ వేసుకోవడం చూసిన దేవయాని ఏంటిది అనగా ఫ్రెష్ అయ్యి వచ్చి చెప్తాను పెద్దమ్మ అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు మహేంద్ర జగతి వసుధార విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ అప్పుడు జగతి మహేంద్ర నోటిలో చక్కెరపొస్తుంది.
వసుధార కేక్ తినిపించాలి విషెస్ చెప్పాలి అని అంటుండగా అప్పుడు ఇవన్నీ కుదురుతాయా జగతి అని అంటాడు మహేంద్ర. అప్పుడు జగతి నా స్టూడెంట్ వసుధారని అభినందించడం కోసం ఈ మాత్రం చేయకపోతే ఎలా మహేంద్ర ఉంటుంది జగతి. ఇదంతా నువ్వే చేయాలి మహేంద్ర అంటూ జగతి మహేంద్ర కు ఆర్డర్ వేస్తుంది. ఎప్పుడు వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. మరొకవైపు ఇంట్లో అందరూ వసుధార కు స్వీట్ తినిపించి కంగ్రాట్స్ చెబుతూ ఉంటారు.
అప్పుడు రిషి కూడా వసుధార కు స్వీట్ తినిపించి కంగ్రాట్స్ చెబుతాడు. అప్పుడు వసుధార ఈ విజయం నాది మాత్రమే కాదు ఇది మీ గొప్పతనం విశేషం అంటూ రిషికి కూడా స్వీట్ తినిపిస్తుంది. చూసిన దేవయానికి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు రిషి ఈ సమయంలో డాడ్ వాళ్లు ఉంటే ఎంత బాగుండేది అని అనుకుంటూ ఉంటాడు. వసుధార కూడా అవును సార్ జగతి మేడం వాళ్ళు ఉంటే చాలా బాగుండేది అని అంటుంది.
Guppedantha Manasu Nov 11 Today Episode : వసుధారకు రింగ్ గిఫ్ట్ ఇచ్చిన రిషి..
అప్పుడు గౌతమ్ ఉన్నటువంటి పేపర్ ఇంటికి వచ్చింది ఆ పేపర్లో జగతి మహేంద్ర మేడం వసుధారకి కంగ్రాట్స్ చెప్పారు అని చెబుతాడు. ఆ పేపర్ ని చూసిన దేవయాని ఒక్కసారిగా షాక్ ఇవ్వడంతో రిషి వసుధార లు మాత్రం సంతోషపడుతూ ఉంటారు. ఆ తర్వాత వసుధార రిషి ఇద్దరు కలిసి ఇంటి బయట దీపాలు వెలిగిస్తూ ప్రేమగా ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు నీ విజయంతో దీపావళి సెలబ్రేట్ నువ్వు ఒక్కటే చేసుకుంటావా అని అంటాడు రిషి.
అప్పుడు అక్కడ ఉన్న దీపం ఆరిపోతూ ఉండగా ఇద్దరు కలిసి ఆ దీపాన్ని ఆరిపోకుండా చేతులు అడ్డం పెడతారు. అప్పుడు వారిద్దరూ ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ప్రేమగా మురిసిపోతూ ఉంటారు. రిషి తన జేబులో ఉన్న విఆర్ అనే అక్షరాన్ని వసుధారకి ఇదే నీకు గిఫ్టుగా ఇస్తున్నాను అనడంతో అది చూసిన వసుధార ఒక్కసారిగా సంతోషపడుతుంది.
ఆ రింగును చూసి ఎంతో ముచ్చట పడిన వస్తదారా ఆ రింగ్ ని రిషి చేతికి ఇచ్చి మీదే నా వేలుకు తొడగండి సార్ అని అంటుంది. అప్పుడు రిషి ఆ రింగును తొడిగిన తర్వాత నువ్వు నా జీవితంలోకి వచ్చాక చాలా కొత్తగా ఉంది వసుధార. జీవితం మొత్తం మారిపోయింది అని అంటాడు రిషి. అప్పుడు సంతోషంతో వసుధార రిషి ని గట్టిగా హత్తుకుంటుంది. రిషి కూడా వసును ప్రేమగా హత్తుకుంటాడు.
Read Also : Guppedantha Manasu November 10 Today Episode : రిషిని కోరిక అడిగిన వసుధార.. దేవయానిని ఒక ఆట ఆడుకున్న ధరణి..?