Guppedantha Manasu Dec 7 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసుధార జగతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో వసుధార మీ అబ్బాయికి నచ్చితే చాలా మేడం నాకు నచ్చాల్సిన అవసరం లేదా అనడంతో మీ ఎండి గారికి నచ్చింది తీసుకోవచ్చు అని అంటుంది.
అప్పుడు వసుధార మౌనంగా ఉండడంతో ఏం మాట్లాడవు అని అనగా సరే మేడం నేను మా రిషి సార్ కి ఇష్టమైన తీసుకుంటాను అని అంటుంది. అప్పుడు వెంటనే జగతి వసు నిన్ను రిషి ని పక్కపక్కనే చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంటుందో అని అంటుంది. అప్పుడు వసుధార కి మెసేజ్ చేస్తూ సర్ మీకు ఇష్టం నచ్చింది తీసుకోండి మీ ఇష్టమే నా ఇష్టం అని అంటుంది.
అప్పుడు చూసి ఏంటి వసుధార మళ్ళీ సెలెక్షన్ నాకే వదిలేసింది అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు గౌతమ్ కాలేజీ స్టాఫ్,స్టూడెంట్స్ అందరికీ ఫోన్ చేసి వనభోజనాలకి రమ్మని చెబుతూ ఉండగా అంతలో దేవయాని అక్కడికి వచ్చి ధరణి పై సీరియస్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మహేంద్ర అక్కడికి వచ్చి గౌతమ్ అందరికీ ఇంఫార్మ్ చేసావా అని అనగా చేశాను అంకుల్ అనడంతో సరే గౌతమ్ రిషి వసుధార జాగ్రత్త అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతాడు.
అప్పుడు గౌతమ్ ఆలోచిస్తూ పెద్దమ్మని పార్టీకి రాకుండా ఎలా ఆపాలి అనుకుంటూ ఒక ప్లాన్ వేస్తాడు. ఆ తర్వాత ధరణి,వసుధార భోజనానికి సిద్ధం చేస్తూ ఉండగా ఎవరికి కనిపించకుండా చాటుగా దాక్కొని వెళ్లి వసుధార రూమ్లో గిఫ్ట్ పెడతాడు రిషి. ఆ తర్వాత అందరూ కలిసి భోజనానికి కూర్చుంటారు. అప్పుడు తను గిఫ్ట్ తెచ్చిన విషయం పక్కనే ఉన్న వసుధార కి మెసేజ్ చేస్తాడు రిషి. ఆ తర్వాత అందరూ భోజనానికి రావడంతో ఏంటి వసుధార వనభోజనాలకు ఏం ప్లాన్ చేశావు అని దేవయాని అడగడంతో ఏం చెప్పాలో తెలియక థాంక్స్ అని చెప్పి అడ్డంగా బుక్ అవుతుంది వసుధార.
Guppedantha Manasu Dec 7 Today Episode : దేవయానిని రిషి ముందు ఇరికించిన గౌతమ్..
అప్పుడు రిషి సార్ ఏదో ఒకటి చెప్పి కవర్ చేయండి అని అంటుంది. ఇప్పుడు రిషి అబద్ధాలు చెప్పి కవర్ చేస్తాడు. అప్పుడు దేవయాని పక్కనే ఉన్న గౌతమ్ ఎలా అయినా పెద్దమ్మని పార్టీకి రాకుండా చేయాలి అని తన చేతి పక్కలో ఉన్న హాట్ బాక్స్ ని కిందికి తోయడంతో అది వెళ్లి దేవయాని కాళ్ళ మీద పడుతుంది. అప్పుడు దేవయాని నొప్పిగా ఉంది అనడంతో తన గదిలోకి తీసుకెళ్తారు. అప్పుడు మీరందరూ వెళ్లండి నీ పెద్దమ్మ దగ్గరే ఉంటాను అని అనగా అదేంటి రిషి మినిస్టర్ గారు నిన్ను అదేపనిగా పిలిస్తే నువ్వు రాకుండా ఉంటే ఎలా అని అంటాడు మహేంద్ర.
అప్పుడు దేవయాని నేను కూడా వస్తాను అని అనగా వద్దు పెద్దమ్మ నీకు కాలు ఇలా ఉంది మీరు నడవలేరు అని దేవయాని ని రాకుండా ఆపేస్తాడు. దాంతో గౌతమ్ వసుధర మహేంద్ర వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు. ఆ తర్వాత రిషి తెచ్చిన చీర కట్టుకొని రిషి దగ్గరకి వెళ్తుంది. అప్పుడు రిషి వసుధార ని చూసి ఒక్కసారిగా పశ్చర్యపోతాడు. చీరలో చాలా అందంగా ఉన్నావు వసుధార అనడంతో థాంక్యూ సార్ అని అంటుంది. అప్పుడు వసుధర రిషికి పువ్వు ఇచ్చి తన జడలో పెట్టమని అంటుంది. అప్పుడు రిషి ఆ పువ్వుని వసుధర జడలో పెట్టి అలాగే చూస్తూ ఉంటాడు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World