Guppedantha Manasu Aug 17 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దేవయాని జగతి పై విరుచుకుపడుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో దేవయాని జగతిపై కోప్పడుతూ ఉంటుంది. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయినందుకు బాధపడాల్సింది పోయి తగుదనమ్మ అంటూ స్వీట్లు తయారు చేయమని చెబుతావా అంటూ జగతి పై ఫైర్ అవుతుంది దేవయాని. అప్పుడు జగతి దేవయానికి తనదైన శైలిలో తిరిగి గట్టిగా కౌంటర్ ఇస్తుంది. ఇంతలో అక్కడికి రిషి రావడంతో పెద్దమ్మ బాధపడుతున్నావా అని అనగా, అప్పుడు గౌతమ్ లేదు రిషి ఇలా జరిగినందుకు పెద్దమ్మ కూడా సంతోషపడుతుంది.
![Guppedantha Manasu Aug 17 Today Episode : నన్ను రిషి అని పిలువు అని చెప్పిన రిషి.. సంతోషంలో జగతి..? Vasudhara and Rishi talk about Sakshi's deed in todays guppedantha manasu serial episode](https://tufan9.com/wp-content/uploads/2022/08/Vasudhara-and-Rishi-talk-about-Sakshis-deed-in-todays-guppedantha-manasu-serial-episode.jpg)
మన మంచికే జరిగింది అంటోంది అంటూ దేవయాని బుక్ చేస్తాడు గౌతమ్. దీంతో రిషి ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి మౌనంగా వెళ్ళిపోతాడు. మరొకవైపు వసు ఆటోలో వెళ్తు ఉంగరం వైపు చూస్తూ జరిగిన విషయాలను తలచుకుకొని బాధపడుతూ ఉంటుంది. రిషి గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో రిషి ఫోన్ చేసి ఆటో దిగమని చెప్పి కారులో ఎక్కించుకొని వెళ్తాడు.
మరోవైపు మహేంద్రవర్మ, ధరణి , జగతి మాట్లాడుకుంటూ ఉండగా మహేంద్ర తన ఆనందాన్ని ఆపుకోలేక పోతాడు. అప్పుడు మహేంద్ర ఆనందాన్ని చూసి జగతి వాళ్ళు కూడా నవ్వుకుంటూ ఉంటారు. సాక్షి చేసిన పనికి చాలా హ్యాపీగా ఉంది నాకు ఇంతకంటే ఇంకేం అవసరం లేదు అని నవ్వుకుంటూ ఉంటాడు మహేంద్ర. మరొకవైపు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయినందుకు దేవయానికి కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
తన ప్లాన్ మొత్తం ఫెయిల్ అయినందుకు చిరాకు పడుతూ ఉంటుంది. జగతి దంపతులు ధరణిని, దేవయాని దగ్గరకు వెళ్లి రమ్మని చెప్పగా ధరణి అక్కడికి వెళ్ళగా దేవయాని కోప్పడి అక్కడి నుంచి పంపిస్తుంది. ఆ తర్వాత దానిని బయటకు వచ్చి దేవయాని పరిస్థితి గురించి జగతితో చెబుతూ ఉండగా ఇంతలో మహేంద్ర అక్కడికి వస్తాడు.
Guppedantha Manasu Aug 17 Today Episode : మనసులు గెలిచిన ఆనందంలో రిషి, వసుధార..
![Guppedantha Manasu Aug 17 Today Episode : నన్ను రిషి అని పిలువు అని చెప్పిన రిషి.. సంతోషంలో జగతి..? Vasudhara and Rishi talk about Sakshi's deed in todays guppedantha manasu serial episode](https://tufan9.com/wp-content/uploads/2022/08/Vasudhara-and-Rishi-talk-about-Sakshis-deed-in-todays-guppedantha-manasu-serial-episode.webp)
అప్పుడు వారి ముగ్గురు కలిసి డాక్టర్ని పిలిపిద్దాం అని అంటూ ఉండగా ఇంతలోనే దేవయాని అక్కడికి వచ్చి ముగ్గురు పైన కోప్పడుతుంది. అప్పుడు మహేంద్ర, జగతికి, వదిన మాటలు పట్టించుకోవద్దు అని ధైర్యం చెబుతాడు. మరొకవైపు వసు, రిషి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత రిషి, వసు ఇద్దరూ రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడ జగతి వాళ్ళు అప్పటికే సంతోషంగా పార్టీ చేసుకుంటూ ఉండటంతో వాళ్లు అక్కడికి రాగా అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.
ఇక రేపటి ఎపిసోడ్ లో రిషి కాఫీ కోసం వెళ్లగా అక్కడ జగతి ఉండడంతో మేడం నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పటినుంచి రిషి సార్ అని కాకుండా రిషి అని పిలవండి అని చెబుతాడు. దాంతో జగతి ఎమోషనల్ అవుతూ సరే రిషి అంటూ రిషికి కాఫీ ఇస్తుంది. రిషి అన్న మాటలకు జగతి సంతోష పడుతూ ఉంటుంది.