Guppedantha Manasu Aug 29 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో వసు,రిషి కీ ఇచ్చిన మాట కోసం చదువుకుంటూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో రిషి నిద్రపోతుండగా మహేంద్ర గౌతమ్ లు అక్కడికి వెళ్లి రిషిని నిద్ర లేపుతారు. అప్పుడు మీ ఇద్దరు ఏంటి ఇక్కడ ఉన్నారు అని అడగగా నీకోసం ఎదురు చూస్తున్నాము. నిన్న వసుధార ని కలిసావు కదా ఏం జరిగింది ఏం మాట్లాడుకున్నారా అని అడగగా అవును మాట్లాడుకున్నాము అనటంతో గౌతమ్, మహేంద్ర సంతోషపడుతూ ఉంటారు.

అప్పుడు వసుధార చెప్పినదానికి నేను ఒప్పుకోలేదు వసు ని చదువుకోమని చెప్పాను అని అంటాడు రిషి. అప్పుడు మహేంద్ర, గౌతమ్ ఇప్పటివరకు నువ్వు మాట్లాడింది చదువు గురించా అంటూ గౌతమ్ అక్కడి నుంచి నిరాశగా వెళ్ళిపోతాడు. అప్పుడు రిషి మహేంద్ర తో మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలుసు కానీ వసు ని ప్రస్తుతానికి చదువుకోనిద్దాము వసుధార మనకు దొరికిన అదృష్టం దాన్ని ఎలా వదులుకుంటాను అని అంటాడు.
మరొకవైపు పుష్ప వసుధార ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇంతలో రిషి కనిపించడంతో వసుధార సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు కండిషన్ ప్రకారం ఇద్దరూ ఒకరినొకరు పలకరించకపోవడంతో ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు రిషి ఒకరితో మాట్లాడకపోతే ఇంత బాధగా ఉంటుందా అని అనుకుంటూ ఉంటాడు.
Guppedantha Manasu Aug 29 Today Episode : రిషి,వసుధార మాట్లాడుకున్నాము అనటంతో ఆనందంలో మహేంద్ర, గౌతమ్..
అప్పుడు వస్తారా రిషి వైపు చూస్తూ కార్లో లిఫ్ట్ ఇవ్వచ్చు కదా అనుకుంటూ ఉండగా అప్పుడు రిషి క్యాబ్ బుక్ చేశాను అని మెసేజ్ చేస్తాను. ఆ తరువాత ఫణీంద్ర,, మహేంద్ర, గౌతమ్, రిషి లు కాలేజీ గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి జగతి బుక్స్ తీసుకొని రావడంతో ఎక్కడికి వెళ్తుంది మేడం అని అనుకుంటూ ఉంటాడు రిషి.
అప్పుడు జగతి, మహేంద్ర నేను వసుధార దగ్గరికి వెళ్తున్నాను అని చెబుతుంది. ఆ తర్వాత గౌతమ్ జగతి కలిసి వసుధార దగ్గరికి బయలుదేరుతారు. మరొకవైపు వసుధార చదువుకుంటూ ఉంటుంది. ఇంతలో కారు శబ్దం రావడంతో రిషి సార్ వచ్చాడు అని ఆనందంగా వెళ్లి తలుపు తీయడంతో అక్కడ జగతి,గౌతమ్ లు కనిపించేసరికి రిషి సార్ సార్ రాలేదా అని అడగగా మేము వచ్చాము కదా వాసు ఇటువంటి సమయంలో అటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు అని చెబుతుంది జగతి.
ఆ తర్వాత రిషి ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ వసుధార తనకు కాపీ ఇచ్చినట్టుగా ఊహించుకుంటాడు. మరొకవైపు వసుధార కూడా చదువుకుంటూ రిషి తన పక్కనే ఉన్నట్లుగా ఊహించుకుంటుంది. చదవకుండా రిషి గురించి తలుచుకుంటూ డిస్టర్బ్ అవుతుంది వసు. అప్పుడు రిషి వచ్చాడు అనుకోని వెళ్లి తలుపు తీసి చూడగా అక్కడ రిషి లేకపోవడంతో ప్రేమతో బాధపడుతూ ఉంటుందివసు.