Guppedantha Manasu Aug 27 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు, రిషి ఇద్దరు కలిసి ఒకే కారులో ప్రయాణిస్తూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో వసు, రిషి ఇద్దరు ఒకరి చేతిలో ఒకటి చెయ్యి వేసుకుని కారులో వెళ్తూ ఉంటారు. అప్పుడు వసుధార రిషి వైపు అలా చూస్తూ మనసులో మాట్లాడుకుంటూ ఉంటుంది. అప్పుడు రిషి ఏం ఆలోచిస్తున్నావ్ వసుధార? నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నేను చెప్పనా అంటూ.. ఎన్నో గొడవలతో మొదలైన ఒక మనిషితో ఈ ప్రయాణంలో ఎన్నో అనుభూతులు తర్వాత ఆఖరికి ఒకటే అయ్యాము అని అనుకుంటున్నావు కదా అని అంటాడు.
అప్పుడు వసు ఆశ్చర్యపోయి ఎలా చెప్పారు సార్ అని అనడంతో ఇద్దరి మనసులు ఒకటే కదా అని అంటాడు రిషి. ఇంతలోనే ఇల్లు రావడంతో వసుని దింపేస్తాడు. అప్పుడు వసు,రిషి ఒకరి వైపు మరొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. మరొకవైపు గౌతమ్, మహేంద్ర ఇద్దరూ ఒకచోట కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు రిషి గురించి మాట్లాడుతూ ఉండగా ఇంతలోని రిషి రావడంతో, మహేంద్ర, గౌతమ్ ఎంత పిలుస్తున్న రిషి పట్టించుకోకుండా పని ఉంది అని లోపలికి వెళ్తుండగా జగతి ఎదురుపడటంతో థాంక్స్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు రిషి.
Guppedantha Manasu Aug 27 Today Episode : దేవయానికి బుద్ధి చెప్పిన జగతి..
కానీ జగతికి ఏమీ అర్థం కాదు. ఆ తర్వాత వసుధార, రిషి ఫోటో చూసి తనలో తానే మాట్లాడుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. రిషి కూడా వసుధార గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరుసటి రోజు సాక్షి, దేవయాని ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఏమి మళ్లీ సాక్షిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడంతో సాక్షి మాత్రం రిషి అంటే తనకు ఇష్టం లేదు అన్న విధంగా మాట్లాడుతుంది.
మరొకవైపు రిషి పడుకుని ఉండగా అక్కడికి మహేంద్ర గౌతమ్ వెళ్లి ఎప్పుడు రిషి లేస్తే అప్పుడు రిషి గురించి అడుగుదామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలోనే జగతి అక్కడికి వచ్చి పడుకున్నప్పుడు డిస్టర్బ్ చేయడం ఎందుకు అని వారిని అక్కడి నుంచి పిలుచుకొని వెళ్తూ ఉంటుంది. దేవయాని ఎదురుపడి మీరు ముగ్గురు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడగగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సమాధానం చెప్పడంతో ఇక్కడ ఏదో జరుగుతోంది అని అనుకుంటుంది దేవయాని.
ఆ తర్వాత మహేంద్ర గౌతమ్ అక్కడినుంచి వెళ్లిపోవడంతో దేవయాని జగతి ఎదురు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు దేవయాని జగతిని బాధ పెట్టే విధంగా మాట్లాడడంతో వెంటనే జగతీ తన స్టైల్ లో దేవయానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. ఆ తరువాత వసుధ రా నిద్ర లేవగానే రిషి చెప్పిన విధంగా చదువుకుంటూ ఉంటుంది.
Read Also : Guppedantha Manasu Aug 26 Today Episode : రిషికి ప్రామిస్ చేసిన వసుధార..రిషి కౌగిట్లో వసు…?