Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో శృతి వేరే వాళ్ళ ఇంట్లో పనిమనిషిగా చేస్తుంది అన్న విషయం తెలిసి తులసి బాధ పడుతూ ఉంటుంది.
ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఇటువంటి నిర్ణయం ఎలా తీసుకున్నామో శృతి కనీసం నాకు ఒక్క మాట చెప్పలేదు అని అనగా వెంటనే శృతి మీరు చెప్పే అవకాశం ఇవ్వలేదు ఆంటీ అని అంటుంది. ఇక తెలిసి శృతి, ప్రేమ్ ల గురించి బాధ పడుతూ ఉంటుంది. అప్పుడు శృతి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం మేము చేస్తున్న ప్రయత్నం ఇది కాబట్టి మాకు ఈ కష్టాలు తప్పవు మీ అనడంతో తులసి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది.
అప్పుడు తులసి ఏదైనా సొంతంగా చేసే ఆలోచన చేయమని అనటంతో దానికి డబ్బులు కావాలి అని ఉంటుంది. అప్పుడు శృతి ఐదు లక్షలు కావాలి దాని కోసమే ప్రయత్నిస్తున్నాము అని అనడంతో పక్కనే ఉన్న అంకిత ఆ డబ్బులు నేను ఇస్తాను అని అనగా వెంటనే తులసి వద్దు అనడంతో అంకిత, తులసికీ క్లాస్ పీకుతుంది. అంకిత డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోవడం తో పాటు ఒక కండిషన్ ను పెడుతుంది.
డబ్బులు నేను ఇచ్చినట్టు కాకుండా మీ ఫ్రెండు ఇచ్చారు అని అర్థం చెప్పు అని అంటుంది. మరొక వైపు అవి అంకిత కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తన తండ్రి కోసం డబ్బులు అడగడానికి ఇటువంటి పరిస్థితి వచ్చింది అని బాధపడుతూ ఉండగా ఇంతలో అంకిత వచ్చి అభి తో కోపంగా మాట్లాడుతుంది.
అప్పుడు అభి ఎక్కడికి వెళ్లావు అని అడగగా తులసి ఆంటీ ని కలవడానికి వెళ్లాను అని అంటుంది అంకిత. అప్పుడు అభి నువ్వు మామ్ దగ్గరికి వెళ్తావు అని నేను ముందే అనుకున్నాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడు అభి అంకిత దగ్గరికి వెళ్లి మా ఇంట్లో వారి కోసం డబ్బులు కావాలి అని అనడంతో అంకిత ప్రేమ్ వాళ్ల కోసమే అని భ్రమపడి సరే అని అంటుంది.
అభి మారిపోయాడు అని సంతోషపడుతుంది. ఆ తరువాత అది తన తండ్రి కోసం అంకిత డబ్బులు ఇచ్చింది అని సంతోష పడుతూ ఉంటాడు. ఇదే విషయం గురించి లాస్య నందు మాట్లాడుకుంటూ ఒకరిపై ఒకరు పోట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అభి ఫోన్ చేసి గుడ్ న్యూస్ చెప్పడంతో సంతోష పడతారు. మరొకవైపు తులసీ బొమ్మలను చూసి బాధపడుతూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World