Horoscope : ఈరోజు ఈ రెండు రాశుల వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే కష్టమే!

Horoscope : ఈరోజు అనగా సెప్టెంబర్ 13వ తేదీ నాడు పన్నెండు రాశుల వాళ్ల రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. మఖ్యంగా ప్రధాన గ్రహాలు అయిన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల రెండు రాశుల వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని వివరించారు. అయితే ఈ రెండు రాశులు ఏంటి, వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

వృశ్చిక రాశి.. వృశ్చిక రాశి వాళ్లు తమ పనుల్లో జాప్యం జరగకుండా చూసుకోవాలి. లేదంటే అన్ని పనులు పూర్తి కాకుండా అలాగే ఉండిపోతాయి. ఇక ఎప్పటికీ పూర్తి చేయలేరు. కుటుంబ బాధ్యతలు ఈరోజు అధికం అవుతాయి. ఒక పరీక్షలా వాటిని ఎదురుకోవలసి వస్తుంది. మీ అంచనాలు మొత్తం తప్పుతాయి. విలువైన వస్తువుల విషయాలలో అజాగ్రత్త పనికి రాదు. బంగారం, డైమండ్, సిల్వర్ వంటి వాటినిచ చాలా జాగ్రత్తగా దాచుకోండి. లేదంటో పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఆదిత్య హృదయం చదవడం మంచి ఫలితాలను ఇస్తుంది.

కుంభ రాశి.. కుంభ రాశి వాళ్లు చేపట్టే పనుల్లో అలసట పెరగకుండా చూసుకోవాలి. అస్థిర బుద్ధి వల్ల ఇబ్బందులకు గురవుతారు. కీలక సందర్భాల్లో పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు అమృత గుళికల్లా పని చేస్తాయి. మనో విచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మేలైన ఫలితాలను ఇస్తుంది.

Advertisement