Zodiac signs : ప్రజలు ఎలాంటి కర్మలు చేసిన శని దేవుడు అదే ఫలితాన్ని ఇస్తాడు అంటారు. శని దేవుడు ఆగ్రహిస్తే మన జీవితంలో అనేక కష్టాలు మొదలవుతాయని అలాగే శని దేవుడు సంతోషిస్తే మన జీవితం సుఖవంతంగా సాగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఒక రాశి నుండి మరొక రాశికి ఒక నిర్దిష్ట వ్యవధిలో రాశిని మారుస్తుంది. ఇది భూమిపైన మానవుని మనుగడ పైన ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అయితే ముఖ్యంగా శనీశ్వరుడిని న్యాయ దేవునిగా పరిగణిస్తారు. ఎలాంటి కర్మలు చేసిన శని దేవుడు ఫలితాన్ని ఇస్తాడు అని అంటారు. అయితే శని దేవుడు జూలై నెలలో మకర రాశిలో సంచరించాడని అది కూడా తిరోగమన స్థితిలో మకర రాశిలో అక్టోబర్ నెల వరికి ఉంటాడని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అంటే శని దేవుడు మూడు నెలల పాటు తిరోగమన స్థితిలో సంచరిస్తున్నాడు అని అర్థం. దీని ప్రభావం అన్ని రాశుల వారిపై కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి శని సంచారం ప్రభావం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. వారు పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశం ఉంది.

మేషం రాశి : మకర రాశిలో శని తిరోగమి ప్రారంభించడం వల్ల ఈ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి ప్రకారం శని తిరోగమనంలో పదవ స్థానంలో ఉంది. ఇది వ్యాపార ,ఉద్యోగ స్థానంగా పరిగణించబడుతుంది. అందువల్ల మీరు కొత్త ఉద్యోగ ప్రతిపాదనను పొందవచ్చు. అలాగే ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. ఈ సమయంలో మీ గౌరవ, మర్యాదలు పెరుగుతాయి.
మీనం రాశి : ఈ రాశి ప్రకారం శని తిరోగమనంలో 11వ స్థానంలో ఉంది. ఈ స్థానం ఆదాయం ,లాభంగా పరిగణించబడుతుంది. ఈ కాలంలో మీ ఆదాయం బాగా పెరుగుతుంది. డబ్బు బాగా సంపాదిస్తారు కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతా బాగా పెరుగుతుంది. డబ్బు బాగా సంపాదిస్తారు కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి. వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు. ఇక వాహనం ,ఆస్తి కొనుగోలు గురించి కూడా ఆలోచించవచ్చు.
ధనస్సు రాశి : రాశి ప్రకారం శని తిరోగమనంలో రెండో స్థానంలో ఉంది. ఈ స్థానాన్ని డబ్బు, మాటల స్థానంగా పరిగణించబడుతుంది. ఈ కాలంలో వాహనాలు, భూమి, ఆస్తుల కొనుగోలు, అమ్మకాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారు పుష్యరాగం రత్నాన్ని ధరించడంవల్ల మంచి లాభాలు కలుగుతాయి. ఇకపోతే ఈ రాశిలో శని అర్థశతకం కొనసాగుతుంది కాబట్టి మీ ఆరోగ్యం క్షీణించి అవకాశం ఉంది.
Read Also : Weekly horoscope : ఈరెండు రాశుల వాళ్లకు ఉద్యోగంలో ఉన్నత స్థితి.. మీరున్నారేమో చూస్కోండి!