Money habits: సమాజంలో కొందరు వ్యక్తులు బాగా డబ్బులు సంపాదిస్తుంటారు. 24 గంటలూ పనీ పనీ అని పాకులాడుతూ ఉంటారు. లక్షల్లో ఇన్ కం వస్తున్నా వేలు కూడా దాచుకోలేరు. వీటికి ఈ నాలుగు చెడు అలవాట్లే కారణం అని మన పెద్దలు చెబుతున్నారు. అయితే ఈ దరిద్రపు అలవాట్ల వల్ల లక్ష్మీ దేవి మన వద్ద ఉండదని వివరిస్తున్నారు. మనల్ని చూసేందుకు కూడా లక్ష్మీదేవి ఇష్టపడదట. అలాంటి అలవాట్లను ఇప్పుడే మానేయండి. అయితే ఈ అలవాట్లు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
స్నేహితులతో పార్టీలు.. అందరూ కాదు కానీ కొందరు వ్యక్తులు ప్రత్యేక సందర్భం ఏమీ లేకపోయినా పార్టీలు చేస్కుంటారు. ఎదుటి వాళ్లను ఇవ్వమని కూడా చాలా సార్లు ఇబ్బంది పెడుతుంటారు. మరి కొందరేమో ఒక్కొక్కరూ ఇంత వేస్కొని చేస్కుందామని చెప్తూ.. కనీసం 1000 నుంచి 2000 వరకు ఖర్చు చేస్తుంటారు. సమయం, సందర్భం లేకుండా ఇలా చేయొద్దని చెప్తున్నారు మన పెద్దలు.
సంపాదనకు తగ్గట్లుగా ఖర్చు.. ఆదాయం మూరెడు.. ఖర్చు బారెడు.. ఈ సామేత ఊరికే రాలేదు. ఆదాయానికి మించి ఖర్చులు చేస్తున్న ప్రతీ ఒక్కరికీ ఇది వర్తిస్తుంది. ఉన్నదాంట్లో సర్దుకుపోతోనే లక్ష్మీదేవి మీ వద్ద నిలుస్తుంది. తరచూ ఎక్కువగా ఖర్చులు చేయడం వల్ల రూపాయి కూడా మిగలదు.
గొప్పలకు పోతే తిప్పలు… అందరిలో నేను చాలా గొప్ప అనిపించుకునేందుకు చాలా మంది చాలా కష్టపడుతుంటారు. వేరే వాళ్ల ఫంక్షన్లలో అయినా వీళ్లే ఖర్చు చేస్తూ బిల్డప్ ఇస్తుంటారు. ఏదైనా కొనేటప్పుడు కూడా ఎక్కువ ధరవి కొనుగోలు చేస్తూ.. అప్పుల పాలవుతుంటారు.
అనవసరంగా షాపింగ్ చేయొద్దు.. జనాలు సాధారణంగా అవసరమైన వస్తువులను మాత్రమే కొంటారు. కానీ మరికొందరు మాత్రం అవసరం లేకపోయినా కొనుగోలు చేస్తుంటారు. వారానికొకసారి బయట తిరుగుతూ అనవసరం అయినవన్నీ కొనేస్తుంటారు. ఈ పద్ధతి మార్చుకోవాలన మన పెద్దలు సూచిస్తున్నారు. అప్పుడే లక్ష్మీదేవి మన చెంత ఉంటుందట.