Beast Movie Review : తమిళ సినీ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకుల్లో మరియు మలయాళ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి రేకెత్తించిన సినిమా బీస్ట్. ఈ సినిమా తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. నెల్సన్ దిలీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆయన గత చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యం లో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ను రూపొందించినట్లు ఆయన పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు.
నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక షాపింగ్ మాల్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. షాపింగ్ మాల్ లో ఉగ్రవాదులు చొరబడి అక్కడ ఉన్న కొంత మంది అమ్మాయకులను అదుపులోకి తీసుకొని తమ డిమాండ్లను నెరవేర్చాలని మారణకాండ సృష్టిస్తూ ఉంటారు. ఆ సమయం లో రా ఏజెంట్ అయిన విజయ్ (వీరరాఘవ) ఏం చేశాడు.. ఆయన గతం ఏంటి అనేది సినిమా లో చూడాల్సిందే.
నటీనటుల నటన విషయానికి వస్తే విజయ్ తన నటన తో ఆకట్టుకున్నాడు. సినిమా లో ఇతర ఏ పాత్ర కూడా పెద్దగా ప్రాముఖ్యత లేదు. కానీ విజయ్ కి మాత్రం కావాల్సినంత స్కోప్ ఇచ్చాడు. హీరోయిన్ పూజా హెగ్డే కేవలం పాటలకే పరిమితమైంది. ఇతర పాత్రల్లో నటించిన వారు వారి వారి పాత్రలకు అనుగుణంగా నటించిన ప్రయత్నం చేశారు. కానీ హీరోకి ఉన్నంత ప్రాముఖ్యత ఏ ఒక్క నటీ నటులు కూడా లేకపోవడంతో చాలా కథ చాలా బలహీనంగా అనిపించింది.
ఇక టెక్నికల్ విషయానికి వస్తే దర్శకుడు నెల్సన్ దిలీప్ స్టోరీ పాయింట్ ని బాగానే చూపించే ప్రయత్నం చేశాడు. కానీ స్క్రీన్ ప్లే విషయంలో తీవ్రంగా నిరాశ పరిచాడు. ఆకట్టుకునే స్క్రీన్ ప్లే తో కాకుండా రెగ్యులర్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించాడు. ఏ మాత్రం కొత్తదనం చూపించక నాటు మోటు స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులకు విసుగు తెప్పించాడు. ఈ సినిమా లో అనుకున్నట్లుగా ఏమీ జరగలేదు. సినిమా తీవ్ర స్థాయిలో నిరాశపరిచింది. ఊహించింది ఒకటైతే మరో విధంగా ఉంది అంటూ స్వయంగా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేసేలా ఉన్నారు.
దర్శకుడు గతంలో చిన్న చిత్రాలను తెరకెక్కించే పెద్ద విజయాలను సొంతం చేసుకున్నాడు. ఆయన పెద్ద చిత్రాలను తీయ లేడని దీంతో నిరూపితమైంది. అతడి యొక్క శక్తి సామర్థ్యాలపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెల్సన్ తదుపరి సినిమా రజినీకాంత్ తో అనే విషయం తెలిసిందే.. ఆ సినిమాపై ఈ సినిమా ప్రభావం ఎంత వరకు ఉంటుంది అనేది చూడాలి.
Read Also : RRR Review : ‘ఆర్‌ఆర్ఆర్’ రివ్యూ.. జక్కన్న చెక్కిన ట్రిపుల్‌ఆర్‌లో హైలైట్స్ ఇవే..!