Tamanna Simhadri : తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.. ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకూ గంట పాటు మాత్రమే ప్రేక్షకులను అలరించిన ఈ బిగ్ బాస్ షో.. 24 గంటల పాటు నాన్ స్టాప్ కంటిన్యూగా ఎంటర్ టైన్ చేస్తోంది. అయితే ఈ బిగ్ బాస్ షోపై తాజాగా సీపీఐ నేత నారాయణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన బిగ్‌బాస్ షో గేమ్ అసలే కాదన్నారు. లైసెన్స్ తీసుకున్న బ్రోతల్ హౌస్ అంటూ సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. రియాల్టీ షో పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.
సీపీఐ నారాయణ వ్యాఖ్యలపై స్పందించిన బిగ్‌బాస్ కంటెస్టెంట్, ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి (Tamanna Simhadri) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక టీవీ డిబేట్‌లో పాల్గొన్న ఆమె సీపీఐ నారాయణపై షాకింగ్ కామెంట్స్ చేశారు. బిగ్‌బాస్ షోను బ్రోతల్ హౌస్ అన్నందుకు నారాయణను చెప్పుతో కొట్టాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ షోలో పాల్గొన్న వారంతా ఎంతో గుర్తింపు పొందారని, ఒకప్పుడు ఉపాధి లేనివారంతా ప్రస్తుతం ఏదో ఒక ఉపాధి పొందుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు. మీకు బిగ్ బాస్ టీవీ షో నచ్చకపోతే ఛానెల్ మార్చుకోవాలని తమన్నా సలహా ఇచ్చారు.
తెలుగు రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ లైసెన్స్ పొందిన అనైతిక షో అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించిన సంగతి తెలిసిందే. అన్నమయ్య వంటి ఎంతో మంచి సినిమాల్లో నటించిన హీరో నాగార్జున ఇలాంటి షోకు హోస్టుగా చేయడం అవమానకరమని అన్నారు. ఈ రియాల్టీ షో ద్వారా ప్రజలకు ఏమి సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలకు అనంతపురం వచ్చిన సీపీఐ నారాయణ హోటల్‌లో విలేకరులతో మాట్లాడారు.
బిగ్‌బాస్ లైసెన్స్ పొందిన షోలో 100 మందిని 100 రోజుల పాటు ఒకచోట ఉంచి అనైతిక చర్యలకు అనుమతినిస్తున్నారని ఆరోపించారు. మహిళలను అవమానపరిచేలా ఈ షో ఉందని విమర్శించారు. ఇలాంటి షోలను ప్రభుత్వం నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ తరహాల షో నిలిపేయాలంటూ వెంటనే నిలిపేయాలంటూ డిజిటల్ క్యాంపెయిన్ కూడా చేపడతామని నారాయణ వ్యాఖ్యానించారు.
Read Also : Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ ఓటీటీ షురూ… పాత కొత్త కంటెస్ట్స్‌తో రచ్చ
Tufan9 Telugu News providing All Categories of Content from all over world