Sridevi Drama Company : బుల్లితెరపై శ్రీదేవి డ్రామా కంపెనీ షో.. కొద్ది కాలంలోనే తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. జబర్దస్త్ కమెడియన్స్ కూడా శ్రీదేవి డ్రామా కంపెనీలో తమదైన కామెడీతో అలరిస్తున్నారు. సుధీర్ యాంకర్‌గా, ఇంద్రజ జడ్జిగా కొనసాగుతోంది. ఇంద్రజ, సుధీర్ వెళ్లిపోవడంతో శ్రీదేవి డ్రామా కంపెనీ రేటింగ్స్ భారీగా పడిపోయానే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం రష్మీ యాంకర్‌గా, పూర్ణ జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ రేటింగ్స్ పెంచడం కోసం మల్లెమాల స్టార్‌మా ఛానల్‌లో ప్రసారమయ్యే గోరింటాకు సీరియల్‌తో ఫేమస్ అయిన అర్జున్, కావ్యలను తీసుకొచ్చారు. వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.
అందుకే ఆఫ్ స్క్రీన్‌లోనూ వీరిద్దరు ప్రేమికులనే టాక్ నడుస్తోంది. స్టార్‌మా ఛానల్‌లో ఫేమస్ అయినా అక్కడి టీమ్ వాళ్లను ఎంతమాత్రం పట్టించుకోలేదు. కానీ, మల్లెమాల తమ ఈవెంట్‌లో ఈ జోడిని తెగ వాడేస్తోంది. అలాగే మరో జోడీని సైతం మల్లెమాల రంగంలోకి దింపింది. సీరియల్‌లో నటిస్తున్న అంబటి అర్జున్, సుహాసిని జంట అందరిని ఆకట్టుకుంటుంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో శ్రీదేవి డ్రామా కంపెనీ రెచ్చిపోయింది. రేష్మి శోభనం గదిలో తన పర్ఫామెన్స్ తో అదరగొట్టింది. గోరింటాకు జోడి అయితే దుమ్ములేపేశారు. అదిరే హాట్ రొమాన్స్ రెచ్చిపోయింది.
Sridevi Drama Company : మల్లెమాల వాకిట్లో స్టార్ మా సీరియల్స్ జోడీలు.. డ్రామా అదిరిందిగా..
శ్రీదేవి డ్రామా కంపెనీలో పర్ఫామెన్స్ చేసేందుకు మిగతా వాళ్లు కూడా తెగ ఆరాటపడుతున్నారు. హైపర్ ఆది ఇంకా రెచ్చిపోయాడు. శోభనం మంచం ఎక్కడంతోనే గుద్దులతో గుద్ధిపడేశారు. జబర్దస్త్ పైమా, ప్రవీణ్ మరో ట్రాక్ నడిపించారు. జబర్దస్త్ ప్రవీణ్, ఫైమా రారా అంటూ ప్రేమగా పిలిచింది. వీరిద్దరి జోడి ప్రేక్షకులను ఎంతగానో నవ్వింపజేసింది. మొత్తానికి స్టార్‌మా జోడీలతో శ్రీదేవి తమ కంపెనీ పిచ్చెక్కిస్తోంది. ఈ జోడిలనే స్టార్ మాగా నవ్వింపజేసింది. అలా మొత్తానికి స్టార్‌మా జోడీలతో శ్రీదేవి కంపెనీ అదిరిపోయింది.
ఈ జోడీలనే స్టార్‌మా వాడుకున్న కూడా ఈ స్థాయిలో పర్ఫామెన్స్ చేయించరేమో.. అందుకే మల్లెమాల ఇలా ఈ జోడీలను వాడేసుకుంది. దాదాపుగా స్పెషల్ ఈవెంట్లలో కచ్చితంగా వీరందరిని మల్లెమాల తీసుకొస్తుంది. శ్రీదేవి డ్రామా కంపెనీలో అందరిని తీసుకుంటారు. అదే పండుగ ఈవెంట్స్‌లో కూడా ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ యాడ్ చేశారు. అందుకే శ్రీదేవి డ్రామా కంపెనీ క్యాలెండర్ అంటూ ఈ ఏడాది ఏయే స్పెషల్ ఈవెంట్లు చేస్తున్నారో కూడా ముందే చూపిస్తున్నారు.
Read Also : Jabardasth Yedukondalu : అందుకే.. నాగబాబు జబర్దస్త్ నుంచి వెళ్లిపోయాడా..? అసలు నిజాలు బయటపెట్టిన ఏడుకొండలు!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world