Sri Reddy Boti Curry : కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగానే ఫాలోవర్స్ నీ పెంచుకుంటు వస్తుంది. ఇక ఈ భామ సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న విషయం మనందరికీ తెలిసిందే. మొదట్లో సినీ నటులు పై వివాదాలు చేస్తూ పోస్టులు పెట్టేది. కానీ ఇప్పుడు అటువంటి గొడవలకు దూరంగా ఉంటుంది. పల్లెటూరి బామ లాగా రెడీ అయ్యి పచ్చని ప్రాంతాలలో వంటలు చేస్తూ వీడియోలను పోస్ట్ చేస్తుంది.
ఆయా ప్రాంతాలకు తగ్గట్టుగా తన గెటప్ లను మారుస్తూ రెడీ అవుతుంది. తాజాగా తెలంగాణ స్టైల్ లో బోటి కూర చేసి పోస్ట్ చేసింది. ఇక ఆ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. మామిడి తోటలో మామిడికాయలు కోస్తూ తన చీరకట్టులో అందాల కనువిందు చేస్తూ మామిడితోటలో బోటి కూర రెసిపీ తయారు చేసింది. కానీ మధ్యలో వర్షం రావడంతో రెసిపీ తయారు చేయడం వీలు కాలేదు.
Sri Reddy Boti Curry : వెరైటీ వంటలతో హీటెక్కిస్తున్న శ్రీరెడ్డి..
మామిడి తోట లో ఉన్న ఫామ్ హౌస్ కి వెళ్లి అక్కడ తెలంగాణ స్టైల్ లో గుమగుమలాడే బోటి కూర తయారు చేసింది. ఇకపోతే ఈమె ఈ వీడియోని చేస్తూ మధ్యలో అమ్మాయిలపై జరుగుతున్న దాడుల గురించి మాట్లాడింది. అమ్మాయిలు ఆవేశపడి ఎవరితోనూ ప్రేమలో పడొద్దు అంటూ చెప్పింది. ఇకపోతే చీరకట్టులో ఆమె తన అందాలను చూపిస్తూ బోటి కూర చేసిన విధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.