Gangavva: మై విలేజ్ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయి మంచి క్రేజ్ సంపాదించిన గంగవ్వ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వృద్ధాప్యంలో.. అచ్చమైన పల్లెటూరి యాసలో మాట్లాడుతూ తన స్టైల్ లో వీడియోలు చేస్తూ.. ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఇలా వచ్చిన క్రేజ్ తో బిగ్ బాస్ కు వెళ్లి సొంతంగా ఓ ఇంటిని కూడా కట్టుకుంది. అయితే ఈ మధ్య సెలబ్రిటీలతో ప్రత్యేక ఇంటర్వ్యూలు చేస్తూ… మరింత క్రేజ్ సంపాదించుకుంటున్నారు. అయితే ఈ కార్యక్రమం చూస్తేనే అర్థం అయిపోతుంది గంగవ్వ క్రేజ్ ఏ రేంజ్ కి వెళ్లిందనేది. అయితే ఈ క్రమంలోనే గంగవ్వ కోసం ప్రత్యేక కారావాన్ కూడా ఇస్తున్నారట.
నెట్ ఫ్లిక్స్ లో విరాట పర్వం విడదల సందర్బంగా హీరో హీరోయిన్లతో కలిసి గంగవ్వ ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. రానా దగ్గుబాటి, సాయి పల్లవి ఈ కార్యక్రమానికి వచ్చారు. చాలా సరదాగా గంగవ్వతో ముచ్చటించారు. గంగవ్వ సాయి పల్లవిని, రానాను ఆశ్చర్యకర ప్రశ్నలు అడుగుతూ.. వారి నుంచి చాలా కొత్త విషయాలను రాబట్టింది. అయితే అంతకు ముందే కారావాన్ అనుభవాన్ని వ్లాగ్ వీడియో ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇది చూసిన నెటిజెన్లంతా హీరోయిన్ రేంజ్ లో గంగవ్వ క్రేజ్ సంపాదించుకోలడం చాలా సంతోషంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.