Karthika Deepam July 1 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సౌందర్య, ఆనందరావు లు జ్వాలా దగ్గరకు వచ్చి జ్వాలనీ ఓదారుస్తూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో ఆనందరావు జ్వాలా నీకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని అనడంతో జ్వాల సీరియస్ అవుతుంది. ఆ తర్వాత మీరు పెద్దవాళ్లు నేను కోప్పడకూడదు మీ మర్యాద పోగొట్టుకోవద్దు అని జ్వాల అంటుంది. అప్పుడు సౌందర్య నాతో చెప్పే ప్రయత్నం చేయగా మీకు దండం పెడతాను నా విషయం వదిలేసేయండి అంటూ కోపగించుకుంటుంది జ్వాలా.
డాక్టర్ సాబ్ నీ తప్ప నా జీవితంలో ఎవరిని భర్తగా ఊహించుకోలేదు అని అంటుంది జ్వాల. అలాగే నా జీవితంలో చెల్లి ఎలాగైతే లేదు అలాగే పెళ్లి కూడా ఉండదు అని అనడంతో సౌందర్య దంపతులు షాక్ అవుతారు. మరొకవైపు హిమ,కార్తీక్,దీపల ఫోటోలు చూస్తూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది. జ్వాలా కూడా కార్తీక్ ఫోటో చూస్తూ ఏంటి నాన్న నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది.
నేను ఎంతగానో ఇష్టపడినా నా డాక్టర్ సాబ్ నాకు దూరమయ్యాడు అంటూ నిరుపమ్ జ్ఞాపకాలు తలుచుకొని బాధపడుతూ ఉంటుంది జ్వాలా. మరొకవైపు హిమ కార్తీక్ దీపల ఫోటోలు చూస్తూ ఎమోషనల్ అవుతూ నేను మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను. బావని సౌర్యని ఒకటి చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్నాను అని బాధపడుతూ ఉంటుంది హిమ.
ఇంతలో సౌందర్య ఆనంద్ రావులు అక్కడికి వచ్చి నువ్వు ఆలోచిస్తున్నది కరెక్ట్ కాదు హిమ కావాలంటే జ్వాలాకు మరొక మంచి పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేస్తాము అని అంటారు. అప్పుడు హిమ, సౌర్య అలా బాధపడటానికి ప్రత్యక్షంగా,పరోక్షంగా నేనే కారణమయ్యాను కాబట్టి భావను జ్వాలాకి ఇచ్చి పెళ్లి చేసి కొంత బాధ అయినా తగ్గించుకుంటాను అని అంటుంది హిమ.
అప్పుడు సౌందర్య దంపతులు హిమకు నచ్చ చెప్పడానికి ఎంత ప్రయత్నించినా వినిపించుకోకపోవడంతో సౌందర్య గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. మరొకవైపు జ్వాల ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే దుర్గ జ్వాలాకి ఫోన్ చేసి ఆనంద్ కి యాక్సిడెంట్ అయింది అనడంతో అక్కడికి పరుగులు తీస్తుంది.
మరొకవైపు ఆనంద్ దగ్గరికి వచ్చిన హిమ ట్రీట్మెంట్ చేస్తూ ఆనంద్ నువ్వు నా సొంత తమ్ముని వేరా అని మనసులో బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే జ్వాలా అక్కడికి వచ్చి హిమను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ తర్వాత ఆనంద్ కొద్దిసేపు జ్వాలా,హిమ ను కలిపినట్టుగా మాట్లాడడంతో జ్వాల ఆనంద్ కి డబ్బులు ఇచ్చి ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
అప్పుడు హిమ జ్వాలా వెనకాలే వెళ్తూ జ్వాలా చెయ్యి పట్టుకుని ఆగమని అంటుంది. ఆ తర్వాత నిరుమ్ భావ ను ప్రేమించడం అబద్ధం, నువ్వు నీ మనసును చంపుకోవద్దు అని హిమ మాట్లాడుతూ ఉండగానే జ్వాల కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జ్వాలా ఆటోలో వెళుతూ హిమ మాట్లాడిన మాటలను తలుచుకొని హిమను మరింత అపార్థం చేసుకుంటుంది. రేపటి ఎపిసోడ్ లో జ్వాలా అనుకోకుండా నిరూపం దగ్గరికి వెళ్లి 500 రూపాయలకు చిల్లర ఇవ్వమని అడుగుతుంది. ఆ తర్వాత బాధపడుతూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Karthika Deepam june 30 Today Episode : ఆనందరావు పై మండిపడ్డ సౌర్య.. దగ్గరవుతున్న హిమ, జ్వాలా..?