Pakka Commercial Movie Review : మ్యాచో స్టార్ గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరికొన్ని గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా గోపిచంద్ మూవీ జూలై 1న (శుక్రవారం) పక్కా కమర్షియల్ మూవీ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. సినిమాకు తగినట్టుగానే ప్రమోషన్లు కూడా పక్కా కమర్షియల్‌గా నిర్వహించారు. ఈ సినిమా కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ కావడంతో ప్రతిఒక్కరూ చూడదగిన మూవీగా అంచనా వేస్తున్నారు.
ఎనిమిదేళ్లుగా సరైన హిట్ పడని గోపిచంద్‌కు ఈసారైన పక్కా కమర్షియల్ మంచి బంపర్ హిట్ ఇస్తుందని, మ్యాచ్ స్టార్ మళ్లీ హిట్ ట్రాక్ లో పడతాయని ఫ్యాన్స్ తెగ ఆరాటపడుతున్నారు. బన్నీ వాసు నిర్మించిన ఈ మూవీకి సినిమాలో కూడా అంతా కమర్షియల్ లుక్ ఉండేలా చిత్ర యూనిట్ జాగ్రత్త పడింది.
Pakka Commercial Movie Review : మ్యాచో స్టార్ గోపీచంద్‌కు ఈసారి హిట్ పడినట్టే..!
ఇప్పటికే రిలీజ్ అయిన సినిమా ట్రైలర్లు, పోస్టర్లు మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ మూవీ రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్‌లో రికార్డులు మోత మోగిస్తోంది. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ మూవీని తెరకెక్కించింది. ఇక ఈ మూవీ నిడివి వచ్చేసి 152 నిమిషాల 8 సెకన్లుగా ఉంది. పక్కా కమర్షియల్ మూవీలో గోపిచంద్ కు జోడీగా నటించిన రాశిఖన్నా లాయర్‌గా కనిపించింది.
స్టోరీ ఇదే :
ఈ మూవీలో గోపిచంద్ లాయర్.. పేరు రాంచంద్.. అతడి దృష్టిలో ప్రతిదీ పక్కా కమర్షియల్.. చాలా ఏళ్ల తర్వాత లాయర్‌గా తిరిగి వస్తాడు. రాంచంద్‌తో సీరియల్ నటిగా ఝాన్సీ(రాసి ఖన్నా) నటించింది. తన సీరియల్ కోసం లాయర్ పాత్ర కోసం రాంచంద్ దగ్గర అసిస్టెంట్‌గా చేరుతుంది. అలా ఇద్దరూ ప్రేమలో పడతారు. రామ్‌చంద్ ఓ కేసు విషేయంలో తన తండ్రితో వాదించాల్సి వస్తుంది. ఇందులో రాంచంద్ ఆ కేసు ఎందుకు టేకప్ చేయాల్సి వచ్చింది. ఇంతకీ ఆ కేసులో మిస్టరీ ఏంటి? తెలియాలంటే మూవీ రివ్యూను పూర్తిగా చదవాల్సిందే..
నటీనటులు వీరే :
పక్కా కమర్షియల్ హీరోగా గోపీచంద్, రాశీఖన్నా నటించగా.. సప్తగిరి, సత్య రాజ్, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్ తదితరులు నటించారు. ఈ మూవీకి మారుతీ దర్శకత్వం వహించాడు. ఛాయాగ్రహణం.. కర్మ్ చావ్లా, సంగీతాన్ని జేక్స్ బిజోయ్ అందించారు. ఇక నిర్మాతగా బన్నీ వ్యహరించాడు.
ఎలా ఉందంటే? :
దర్శకుడిగా మారుతీ తనదైన మార్క్ చూపించాడు. మారుతి అనగానే అందరికి కామెడీ టైమింగ్ గుర్తుస్తుంది. తన సినిమాలో కామెడీతో మూవీని ముందుకు నడిపిస్తాడు. ప్రేక్షుకులను కడుపుబ్బా నవ్విస్తాడు. ఇప్పుడే అదే కామెడీని పక్కా కమర్షియల్ మూవీలోనూ ఎక్కువగానే పంచాడు. ఏ జానర్‌లో చూపించినా కామెడీని అందించడంలో దిట్ట. పక్కా కమర్షియల్‌లో కామెడీ ఉన్నప్పటికీ అది మారుతి సినిమా చూస్తున్నామనే భావన పెద్దగా అనిపించలేదనే చెప్పాలి. మారుతీ సినిమాల్లో ఎక్కడా పెద్దగా యాక్షన్ చూడలేదు.. అలాంటిది పక్కా కమర్షియల్‌లో ఫుల్ యాక్షన్ అందించాడు. గోపీచంద్ అంటేనే యాక్షన్ ఉండాల్సిందే..
అప్పుడే గోపిచంద్ అభిమానులకు ఫుల్ జోష్ వచ్చేది.. అది మిస్ కాకుండా.. కామెడీ టైమింగ్ దెబ్బతినకుండా మారుతి జాగ్రత్తపడ్డాడు. ఎంత కామెడీ ఉన్నా.. సినిమాలో ఏదో కొంచెం మిస్ అయిందనే భావనతో కొంచెం బోర్ ఫీల్ అయ్యేలా అనిపించవచ్చు. ఫస్ట్ హాఫ్ మారుతీ మార్క్ కామెడీ, గోపీచంద్ మార్క్ యాక్షన్ అద్భుతంగా సాగాయి. ఇక సెకండాఫ్ పెద్దగా కొత్తగా అనిపించేలా లేదు. కామెడీ విషయానికి వస్తే.. ఆర్టిఫీషియల్‌గా కనిపిస్తుంది. అంటే నేచురల్ కామెడీ పండించినట్టుగా అనిపించలేదు. ప్రేక్షకులను కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకోగల నటులు ఉన్నా వారిని పాత్రకు మేర తగినట్టుగా వాడుకోవడంలో మారుతి సక్సెస్ కాలేకపోయారనే ఫీల్ రావొచ్చు. ఇలాంటి కామెడీని 2 గంటల పాటు థియేటర్లలో కూర్చొని ఒక ప్రేక్షకుడు ఆస్వాధించగలగాలి..
ఏదిఏమైనా మూవీలో క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది.. రామ్‌చంద్ పాత్రలో గోపీచంద్ అద్భుతంగా నటించాడు. ఫుల్ లెంగ్త్ కామెడీలో గోపిచంద్ కనిపించి అలరించాడు. తనదైన బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్‌తో గోపిచంద్ అద్భుతమైన కామెడీని పంచాడు. ఇక ఝాన్సీగా రాశి కన్నా తన పాత్రకు న్యాయం చేసింది. ఇక రావు రమేష్ తనదైన కామెడీ టైమింగ్‌తో మెప్పించాడు. సత్యరాజ్ సహా ఇతర నటీనటులు తమ పాత్ర మేరకు పోషించారు.
కామెడీకి మారుపేరు అయినా మారుతీ కామెడీ ఈసారి మిస్‌ఫైర్ అయినట్టే అనిపించవచ్చు. ఎందుకంటే పక్కా కమర్షియల్ మూవీలో మారుతి తనదైన మార్క్ కనిపిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే ప్రేక్షకులను థియేటర్లలో రెండు గంటల పాటు నవ్వించడంలో మారుతి పాక్షికంగా విజయం సాధించినట్టే. టెక్నికల్‌గా పక్కా కమర్షియల్ మారుతీకి బెస్ట్ ఫిల్మ్‌గా నిలుస్తుంది. జేక్స్ బిజోయ్ పాటలు ఆకట్టుకునేలా లేవు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపించింది. చివరిగా ఒక మాటలో చెప్పాలంటే.. పక్కా కమర్షియల్ అనేది పైసా వసూల్ మూవీ అని చెప్పాలి..
పక్కా కమర్షియల్ మూవీ
సినిమా రేటింగ్ రివ్యూ : 3.5/5
ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే? :
ఇప్పటికే ఈ మూవీ OTT రైట్స్ స్ట్రీమింగ్ దిగ్గజం Netfilx కొనుగోలు చేసింది. తెలుగు ఓటీటీ అయిన ఆహా (Aha) కూడా హక్కులను సొంతం చేసుకుంది. ఈ మూవీ రిలీజ్ అయిన కనీసం 5 వారాల తర్వాత గానీ ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సినిమా టికెట్ల విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో పక్కా కమర్షియల్ మూవీ టికెట్లను భారీగా తగ్గించారు. ఈ సినిమా ఇప్పటికే ఏపీ, తెలంగాణలో రూ.17.50 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుందని టాక్.
కర్ణాటకతో పాటు మిగతా భారతదేశ వ్యాప్తంగా 50 లక్షలు, ఓవర్ సీస్ లో రూ.1.20 కోట్ల బిజినెస్ జరిగినట్టు తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే.. పక్కా కమర్షియల్ మూవీ రూ.19.20 కోట్లు బిజినెస్ జరుపుకుందని టాక్. ఈ మూవీ రికార్డులు కొల్లగొట్టాలంటే రూ. 20 కోట్లు వసూళ్లను రాబట్టాలి. సిటీమార్ మూవీతో యావరేజ్ హిట్ కొట్టిన గోపిచంద్ చాలా ఏళ్ల తర్వాత మంచి హిట్ కోసం చూస్తున్నాడు. ఈ పక్కా కమర్షియల్ మూవీ ద్వారా హిట్ తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నాడు. పక్కా కమర్షియల్ మూవీ అంచనాలకు తగినట్టుగా ఏ స్థాయిలో హిట్ టాక్ అందుకుంటుందో కొన్ని గంటల్లో తేలిపోనుంది.
Read Also : Sammathame Movie Review : సమ్మతమే మూవీ రివ్యూ & రేటింగ్..!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world