Snake fest: కొన్ని పండగలు, ఆచారాలు భలే వింతగా ఉంటాయి. అయితే కొత్తగా చూసే వారికి వింతగా అనిపించినా.. అవి పాటించే వారికి మాత్రం సంప్రదాయబద్ధంగానే ఉంటుంది. బీహార్ లోని బెగుసరాయ్ జిల్లా మన్సూర్ చౌక్ మండలం ఆగాపూర్ గ్రామంలో సాంప్రదాయబద్ధంగా జరిగిన ఓ వేడుకకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. నాగ పంచమి రోజు నాగ దేవతకు ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత పాలు పట్టుకుని పుట్ట వద్దకు వెళ్లి భక్తి శ్రద్ధలతో పుట్టలో పాలు పోసి ఆ దేవతను ఆరాధిస్తారు. కోరుకున్న కోరికలు తీర్చమని వేడుకుంటారు. అయితే బీహార్ లోని ఆగాపూర్ గ్రామంలో నాగ పంచమి వేడుకలు కొంత భిన్నంగా జరుగుతాయి. కానీ చాలా ఘనంగా జరుపుకుంటారు అక్కడి ప్రజలు.
భగత్ అని పిలిచే పూజారాలు గ్రామంలోని భగవతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం డప్పు వాయిద్యాలతో గండక్ నది వద్దకు చేరుకుంటారు. నదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. అనంతరం నీటి లోపలి నుండి పాములను బయటకు తీసి వేడుక చేస్తారు. ఇలా పాములు తీయడాన్ని అక్కడి ప్రజలు పుణ్య కార్యంగా భావిస్తారు. భగత్ లు ఇలా పాములు తీయగానే గ్రామస్థులు చప్పట్లు, ఈలలు, కేకలతో సంతోషం వ్యక్తం చేస్తారు. కొందరైతే నోటితోనూ పాములను పట్టుకుంటారు. ఈ పాములతో విన్యాసాలు చేస్తూ గ్రామంలోకి వెళ్తారు. ఈ పాములకు కొన్నింటికి విషం ఉంటుంది. అయినా ఆ పూజారులు ఎవరూ భయపడరు. ఆ పాములు కూడా వారిని ఏమీ అనవని అక్కడి వారు చెబుతుంటారు. వేడుకల తర్వాత ఆ పాములను తీసుకెళ్లి పొదల్లో వదిలి పెడతారు.దాదాపుగా 300 ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోందని అక్కడి ప్రజలు చెబుతున్నారు.
Rythu Bharosa : తెలంగాణ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా డబ్బులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.…
Jeera Saunf water : మీ ఇంటి వంటగదిలో సులభంగా లభించే అనేక దినుషుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని…
CBSE Admit Card 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025 బోర్డు పరీక్షలకు అడ్మిట్…
NPS Zero Tax : మీరు వేతనజీవులా? ప్రతినెలా జీతం పొందే వ్యక్తి అయితే.. మీకో గుడ్ న్యూస్.. బడ్జెట్…
Vitamin E deficiency : శరీరం సరిగ్గా పనిచేయడానికి అన్ని విటమిన్లు, ఖనిజాలు అవసరం. ఏదైనా విటమిన్ లోపం ఉంటే..…
Lungs Detox : ఊపిరితిత్తులను శుభ్రపరిచే మార్గాలివే : ప్రస్తుత మన జీవనశైలి.. మన ఊపిరితిత్తులపై చాలా చెడు ప్రభావాన్ని…
This website uses cookies.