Sravana bhargavi: నిన్న మొన్నటి వరకు స్టార్ సింగర్ లా గౌరవం పొందిన సింగర్ శ్రావణ భార్గవి నేడు విపరీతమైన ట్రోల్స్ కి గురవతుతోంది. ఎవరికి నచ్చినట్లు వాళ్లు ఈమెను ఆడేసుకుంటున్నారు. మొన్నటి వరకు శ్రావణ భార్గవి, ఆమె భర్త హేమ చంద్ర విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. వారు కొంత కాలం నోరు మెదపకపోయే సరికి అది నిజమో కావొచ్చని చాలా మంది భావించారు. ఈ క్రమంలోనే వారిద్దరూ కలిసి మేమేం విడాకులు తీసుకోవట్లేదని ప్రటించడంతో.. ఈ వార్తలకు చెక్ పడింది. ఇంతలోనే మరో కొత్త వార్త శ్రావణ భార్గవి ఫుల్ ట్రోల్స్ కి గురయ్యేలా చేస్తోంది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రావణ భార్గవి ఇటీవల అన్నమయ్య రాసిన ఒపరికొకరపరి వ్యారమై కీర్తనను తనదైన స్టైల్ లో పాడింది. అంతేనా కాళ్లు పైకి పెట్టి ఊపుతూ, వివిధ భంగిమల్లో కనిపిస్తూ వీడియో కూడా చేసింది. అయితే ఇది చూసిన వారంతా అన్నమయ్యను కించ పరుస్తున్నావంటూ కామెంట్లు చేయడం, ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే బీజేపీ నాయకురాలు శ్వేతారెడ్డి ఓ సెల్ఫీ వీడియో పోస్టు చేసింది. అందులో శ్రావణ భార్గవపై విపరీతమైన కామెంట్లు చేసింది.
https://youtu.be/dYkm5hw0pMs
ఎంతో మంది మంచి మంచి సింగర్స్ అన్నమయ్య పాటలకు ఎంత చక్గా భక్తి భావంతో పాడుతారు కానీ.. నువ్వు నీకు నచ్చినట్లుగా అడ్డదిడ్డంగా పాడటం సరైనది కాదని తెలిపింది. నీకు డివర్స్ డిప్రెషన్ ఉంటే వేరే వీడియోలు చేసుకో కానీ ఇలాంటివి చేసి దేవుడిని కించ పరచకంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నువ్వు.. నీ కోతిమొహం, చింపాంజీ మొహంపై పాటలు రాసుకొని పాడుకో.. అంటూ మండి పడింది. సింగర్లకు, బొంగర్లకు ఇదే చెప్తున్నా.. దేవుడిని కించ పరిస్తే ఊరుకునేది లేదని తెలిపింది.