Shilpa shetty : బాలీవుడ్ ముద్దుగుమ్మ శిల్పాశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన క్యూట్ క్యూట్ అందాలతో కేక పెట్టించే అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. తనకు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తన గ్లామరస్ ఫొటోలతో పాటు, ఫ్యాషన్, హెల్త్, యోగా, కుకింగ్ కు సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేస్తుంటుంది. అయితే శిల్పా శెట్టి తాజాగా నికమ్మ అనే చిత్రంలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలోని ఓ పాటను ఇటీవలే చిత్ర బృందం విడుదల చేసింది.
అయితే ఇందులో శిల్పా శెట్టి చాలా బాగా డ్యాన్స్ చేసింది. అదిరిపోయే మూమెంట్స్ తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 46 ల్ల వయసులోనూ శిల్పా శెట్టి ఈ రేంజ్ లో డ్యాన్స్ చేసడం చాలా బాగుందంటూ ప్యాన్స్ కామెంట్లు చేస్ుతన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.