Intinti Gruhalakshmi September 8 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో సామ్రాట్ తులసి ఇంటికి వచ్చి తులసి పై ఫైర్ అవుతూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో సామ్రాట్,తులసి మీద కోపంగా అరుస్తూ ఉండగా అప్పుడు అప్పుడు ప్రేమ్ ఏం జరిగింది సామ్రాట్ గారు అని అడగడంతో మొన్న నువ్వు మీ అమ్మ ఎదుగుదలను ప్రోత్సహించమని చెప్పావు కదా ప్రేమ్ ఇప్పుడు మీ అమ్మని ఎదుగుదలను ఆపేస్తోంది. మీ అమ్మకు ఇగో అడ్డం వస్తోంది అంటూ కోపంగా అరిచి ఆ న్యూస్ పేపర్ ని విసిరేస్తాడు. ఆ పేపర్ ని చూసి అందరూ షాక్ అవుతారు.
అప్పుడు అంకిత ఇది ఆంటీ చేసిన పని కాదు అని సామ్రాట్ కి నచ్చ చెప్పాలని చూసినా కూడా సామ్రాట్ వినిపించుకోకుండా కోపంతో అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సామ్రాట్ ఇంటికి వెళ్ళగా అక్కడ పని మనుషులపై కోపం చూపిస్తూ ఉండడంతో ఇంతలో వాళ్ళ బాబాయ్ అక్కడికి వచ్చి ఏం జరిగింది అని అడగగా జరిగింది మొత్తం సామ్రాట్ వాళ్ళ బాబాయ్ కి వివరించి కోప్పడుతూ ఉంటాడు.
తులసి గారిని ఎంత నమ్మాను కానీ ఇప్పుడు నా మీద నాకే అసహ్యం వేస్తోంది అని మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలోనే హనీ సామ్రాట్ దగ్గరికి వచ్చి తులసి ఆంటీ తో మాట్లాడి చాలా రోజులు అయింది నాన్న ఒకసారి ఫోన్ చేసి చూపించవా అని అడగగా వెంటనే సామ్రాట్ హనీ మీద కోపంతో రగిలిపోతూ ఏం తులసి ఆంటీ లేకపోతే తినవా పడుకోవా మాట్లాడవా అంటూ హనీ పై కోపంతో విరుచుకుపడతాడు.
Intinti Gruhalakshmi September 8 Today Episode : ఆనందంలో నందు, లాస్య…
ఇక సామ్రాట్ మాటలకు భయపడిపోయిన హనీ వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్తుంది. మరొకవైపు అభి అవకాశం దొరికింది కదా అనే తులసి మీద లేనిపోని చాడీలు చెబుతూ అందరి మీద విరుచుకుపడుతూ ఉంటాడు. అప్పుడు ప్రేమ్ కూడా అవును అమ్మ నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు. నువ్వు మౌనంగా ఉండడం వల్ల ఆయన నువ్వే తప్పు చేసావ్ అని అనుకుంటున్నారు అని అనగా తులసి మాత్రమే మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది.
అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా తులసి ప్రవర్తనను తప్పు బట్టి తులసిని తిడతారు. నేనే తప్పు చేయలేదు ఏదో ఒక రోజు సామ్రాట్ గారికి నిజం తెలుస్తుంది అని అంటుంది తులసి. మరొకవైపు నందు లాస్య సంతోషంగా టీ తాగుతూ మనం అనుకున్న పనులు అన్ని సక్సెస్ అవుతున్నాయి అని ఆనందపడుతూ ఉంటారు. సామ్రాట్ తులసి కలిసి అవకాశం ఎప్పటికీ లేదు నమ్మకం వచ్చింది అని సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు.
ఆ తర్వాత సామ్రాట్ తన తప్పు తెలుసుకుని హనీ దగ్గరకు వెళ్ళగా హనీ మాత్రం దగ్గరకు రావద్దు అంటూ సామ్రాట్ ని దూరం పెట్టడంతో సామ్రాట్ ఎమోషనల్ అవుతూ అని దగ్గరికి వెళ్తాడు. అప్పుడు హనీ ఎందుకు నాన్న అంతలా కోపడ్డావు అని అనగా అప్పుడు వెంటనే సామ్రాట్ తులసి ఆంటీ ఇక్కడ లేరు అని అబద్ధం చెబుతాడు. మరి అదే విషయం చెప్పచ్చు కదా నాన్న ఎందుకు అంతలా గట్టిగా అరిచావు అని అంటుంది హనీ. ఆ తర్వాత హనీ సామ్రాట్ ఇద్దరూ కలిసి పోతారు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World