...

Ritika Singh : ఇక లాభంలేదనుకున్న రితికా సింగ్.. డోసు పెంచాల్సిందే అనుకుని ఇరగదీసేసింది.. వీడియో

Ritika singh : గురు సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయం అయింది రితికా సింగ్. ఫ్యామిలీ హీరో వెంకటేష్ హీరోగా నటించగా.. రితికా సింగ్ హీరోయిన్ గా కనిపించింది గురు మూవీలో. ఈ చిత్రంలో రితికాదే మెయిన్ రోల్. వెంకటేష్ కంటే కూడా రితికాకే ఎక్కువ ప్రాధాన్యమున్న పాత్ర. ఈ క్యారెక్టర్ కు రితికా మంచి న్యాయమే చేసింది. సినిమా కూడా ప్రేక్షకులను అలరించింది. కానీ రితికా సింగ్ కు రావాల్సిన గుర్తింపు మాత్రం రాలేదనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత అవకాశాలు వరుస కడతాయనుకుంటే అనుకున్నది మాత్రం జరగలేదు.

గురు తర్వాత రితికా సింగ్ కు అంతగా అవకాశాలు లేవనే చెప్పాలి. గురు తర్వాత లారెన్స్ తో కలిసి చేసిన హారర్ మూవీలోనూ రితికా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. తన పాత్ర పరిధిలో నటించి ఆకట్టుకుంది. ఈ సినిమా అంతగా ఆడలేదు. ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా గుర్తించలేనంతా స్పీడ్ వచ్చి వెళ్లి పోయింది. ఈ మూవీ తర్వాత కూడా రితికాకు అవకాశాలు రాలేవు.

రితికా సింగ్ నటించిన ఓ మై కడవులే తమిళ్ లో మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రం ప్రస్తుతం తెలుగులో రీమేక్ అవుతోంది. రాబోయే చిత్రం నుండి ఓ డ్యాన్స్ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో రితికా సింగ్ దుమ్మురేపింది. ఎప్పుడూ లేని విధంగా గ్లామరస్ గా కనిపించింది రితికా సింగ్. రితికా డ్యాన్స్ ఇప్పుడు విశేషంగా అలరిస్తోంది.