Guppedantha Manasu serial Oct 15 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు ని చీర కట్టుకోమని జగతి ఎంత చెప్పినా కూడా వినిపించుకోదు.
ఈరోజు ఎపిసోడ్ లో జగతి నా మాట విని ఈ చీరను కట్టుకో వసు అని అనగా వసుధార మాత్రం తన మొండిపట్టు ని విడువదు. లేదు మేడం నేను కట్టుకోను అని అంటుంది. దాంతో వసుధర మాటలకు విసిగిపోయిన జగతి అక్కడికీ ధరణి రావడంతో వసుధరకు చీర కట్టించు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు గౌతమ్ పెద్దమ్మ పూజ ఎప్పుడు పూర్తవుతుంది నాకు ఆకలేస్తుంది అని అనగా వసు వచ్చి హారతి ఇస్తే పూజ పూర్తి అవుతుంది అనటంతో సరే అని అంటారు గౌతమ్.
ఇంతలోనే అక్కడికి జగతి వస్తుంది. ఏంటి జగతి ఒకదానివి వస్తున్నావు అని అనగా వసు రెడీ అవుతుంది అక్కయ్య అని చెబుతుంది. ఇంతలోనే రిషి ఇచ్చిన చీర ధరణి కట్టుకొని రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు దేవయాని ఏంటి ధరణి ఆ చీర నువ్వు ఎందుకు కట్టుకున్నావు అని కోపంగా అరుస్తుంది. అప్పుడు వసు నేనే కట్టుకోమన్నాను మేడం అని అనడంతో వెంటనే జగతి ఏం చెప్పాను నువ్వు ఏం చేస్తున్నావ్ వసుధార అని గట్టిగా అరుస్తుంది.
అదే మంచి సమయం అనుకున్న దేవ అని రెచ్చిపోతూ నువ్వు ఎందుకు పడతావు జగతి ఆశ్చర్య విలువ ఇంట్లో వాళ్లకు తెలుస్తుంది పరాయి వాళ్లకు తెలియదు అని మాట్లాడుతుంది. అప్పుడు రిషి కోపంగా మనం ఒకటి చెప్పాను వాళ్లకు నచ్చకపోతే అది మన ఆలోచనలు రుద్దులేము కదా మా నానమ్మ చీర అని చెప్పాను అయినా సరే విలువ ఇవ్వలేదు అంటే అన్ని రిషి మౌనంగా ఉండిపోతాడు.
Guppedantha Manasu అక్టోబర్ 15 ఎపిసోడ్ : వసుని కొట్టిన జగతి..కోపంతో రిషి..
ఆ తర్వాత ధరణి దేవయాని వెళ్లి హారతి ఇచ్చి పూజ పూర్తి చేయి అని చెబుతుంది. రిషి ప్రవర్తనను చూసి జగతి బాధపడుతూ వసు నాకు రూమ్ లోకి నీతో మాట్లాడాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు గదిలో జగతి జరిగిన విషయాలను తలుచుకునే బాధపడుతూ ఉంటుంది. అప్పుడు వసు అక్కడికి వచ్చి నేను చెప్పేది వినండి మేడం అని అనగా జగతి వద్దు వసుధార అంటూ గట్టిగా అరుస్తుంది.
మనుషులు జీవితాలతో ఆడుకునే అంత తెలివైన దానివి అని నాకు తెలీదు నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను గొడవ చేయొద్దు అని కానీ నా మాట నువ్వు లెక్క చేయలేదు అని జగతి బాధపడుతూ ఉంటుంది. ఈరోజు నీవల్ల రిషి అందరి ముందు తలదించుకున్నాడు. అప్పుడు వస్తారా జగతి ఎంత చెప్పినా వినిపించుకోకుండా మళ్ళీ గురుదక్షిణ గురించి మాట్లాడటంతో కోపంతో రగిలిపోతున్న జగతి వసుధార చెంప చెల్లుమనిపిస్తుంది.
దాంతో మహేంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. అది చూసిన రిషి మేడం అంటూ గట్టిగా అరుస్తాడు. ఇంతలోనే అక్కడికి దేవయాని వస్తుంది. రిషి అక్కడికి వచ్చి మేడం మీరు వసు మీద చేయి చేసుకోవడం ఏంటి అంటూ గట్టిగా అరుస్తూ జగతిపై కోప్పడతాడు. అప్పుడు దేవయాని ఏంటి జగతి ఇది వసు ని కొట్టడం ఏంటి అయినా ఇది పద్ధతి కాదు.
ఏం హక్కు ఉందని నీకు వసు ని కొట్టావు అనగా నన్ను కొట్టే అర్హత మేడంకి మాత్రమే ఉంది నేను చేసిన పని మేడంకి తప్పు అనిపించింది అందుకే కొట్టింది మేడం అని అంటుంది వసుధార. అప్పుడు రిషి వసుధారా బాధపడితేనే నేను చూడలేను అటువంటిది తన మీద చేయి చేసుకున్నారు అంటే నేను చూస్తూ ఊరుకుంటానా అంటూ కోప్పడుతూ ఉంటాడు. అప్పుడు దేవయాని మరింత రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉంటుంది.
రిషి ని కాదనుకుంటుంది అయినంత మాత్రాన కొట్టాలా అది తన ఇష్టం నువ్వేం బాధపడొద్దు రిషి అని మనం అనుకున్నట్టు జరగవు కదా అని కావాలని ఒకవైపు రిషి ని రెచ్చగొడుతూ మరోవైపు ఓదారుస్తుంది దేవయాని. అప్పుడు మహేంద్ర వెళ్లి వసుధారని క్షమాపణలు అడగగా, అయ్యో సార్ నాకు క్షమాపణలు చెప్పాల్సిన పని లేదు మేడం కొట్టినందుకు నాకు బాధగా లేదు అని అంటుంది వసుధార. అప్పుడు జగతి ,వసు నన్ను అని అనేలోగే రిషి ఆపి చాలు మేడం ఇంక చాలు దండం పెడతాను ఎవరికైనా భరించే శక్తి కొంతకాలమే ఉంటుంది. నేను అలసిపోయాను, విసిగిపోయాను ఇవన్నీ మనసున్న వాళ్ళకే తెలుస్తుంది. చిన్నప్పుడే కన్న కొడుకుని వదిలేసిన వాళ్ళని కాదు. అని కోపంతో జగతిని తిట్టి అక్కడ నుంచి వసుధార చేయి పట్టుకుని బయటకు తీసుకెళ్లిపోతాడు రిషి. .
Read Also : Guppedantha Manasu Oct 14 Today Episode : వసుకి ప్రేమతో చీర తెచ్చిన రిషి.. కోపంతో రగిలిపోతున్న దేవయాని?