Guppedantha Manasu serial September 17 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మహేంద్ర, జగతి లు సంతోషంగా ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ రిషి,దేవయానిని భోజనం చేయి పెద్దమ్మ అని అనగా లేదు రిషి మీరు వెళ్లి తినండి అని అంటుంది దేవయాని. అందరూ భోజనం చేస్తూ ఉండగా అప్పుడు రిషి,వసు ని కూడా భోజనం చేయమని అడగడంతో అప్పుడు మీరు కూడా తినండి అంటూ వారిద్దరూ కలిసి తింటూ ఉంటారు. అది చూసిన జగతీ దంపతులు మురిసిపోతూ ఉండగా దేవయాని మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
అప్పుడు వసు పెదవులపై అన్నం మెతుకులు ఉండగా అది రిషి తుడచడంతో అది చూసి జగతి దంపతులు ఆశ్చర్యపోతూ ఉంటారు. దేవయాని మాత్రం ఏదో ఒకటి చేయాలి అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ తర్వాత పార్టీ అయిపోయి అందరూ ఒకచోట వచ్చి చేరగా అప్పుడు మహేంద్ర, రిషికి థాంక్స్ చెబుతాడు.
అప్పుడు మహేంద్ర వర్మ దేవయానితో కూడా కూల్ గా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు దేవయాని అదంతా తన ఆలోచన కాదని వసుధార ఆలోచన అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు. అంతేకాకుండా వసు చాలా తెలివైనది. కోపంగా ఉండే రిషి ని పూర్తిగా మార్చేసి తన గుప్పెట్లో పెట్టుకుంది అని వసుధారని టార్గెట్ చేస్తూ మాట్లాడడంతో జగతి దంపతులు ఏం జరుగుతుంది తెలియక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు.
Guppedantha Manasu serial : బాధతో కుమిలి పోతున్న వసు..?
మహేంద్ర వర్మ గురుదక్షిణ కింద వసుధారతో ఒక మాట తీసుకున్నాడు అని అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. రిషి జగతిని అమ్మ అని పిలవాలని అది చేసి చూపిస్తాను అని వసుధార మహేంద్ర వర్మ కి మాట ఇచ్చింది అనడంతో రిషి షాక్ అవుతాడు. అప్పుడు ఎంతమంది చెప్పినా కూడా దేవయాని వినిపించుకోకుండా అందరి సంతోషాన్ని చెడగొడుతుంది.
రిషిని మార్చి జగతి పుట్టినరోజు జరిపించింది. ఈరోజు పెళ్లిరోజు కూడా జరిపించింది. రేపు అమ్మ అని కూడా పిలిపిస్తుంది. ఇటువంటి మంచి కోడలు నీకు కూడా దొరకదు కాబట్టి వసుధార వాళ్ళ అమ్మానాన్నలతో మాట్లాడి మన ఇంటి కోడలు చేసుకుందాము అని అంటుంది దేవయాని.
ఇక దేవయాని మాటలకు కోపంతో రగిలిపోయిన రిషి ఆపండి పెద్దమ్మ ఇక మాట్లాడకండి అంటూ కోపంతో బయటికి వెళ్లి పోతూ ఉండగా వసుధర వెళ్లి అడ్డుపడుతుంది. అప్పుడు పక్కకు తప్పుకు వసుధార అని గట్టిగా అరిచి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు వసుధార ఎమోషనల్ అవుతూ ఉండగా మహేంద్ర వర్మ జగతికి చేతులెత్తి మొక్కుతాడు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World