...

Guppedantha Manasu: వసుని అపార్థం చేసుకున్న రిషి.. ఎమోషనల్ అవుతున్న మహేంద్ర..?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి కోపంగా ఇంటి నుంచి వెళ్లిపోతాడు.

Advertisement

ఈరోజు ఎపిసోడ్లో వసుధార జరిగిన విషయం తలుచుకుని బాధపడుతూ ఎలా అయినా రిషి సార్ కి నిజం చెప్పాలి అని బయలుదేరుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి దేవయాని వస్తుంది. తలుపు వేసి వసుధారా ఎక్కడికో బయలుదేరినట్టు ఉన్నావు నీతో కొంచెం మాట్లాడాలి కూర్చో అని అంటుంది. అప్పుడు దేవయాని ప్రతి దానికి సమయం ఉంటుంది.

Advertisement

Advertisement

ఈసారి టైం నీదైతే తర్వాత టైం నాది ఇప్పుడు టైం నాది నడుస్తుంది అని అనగా వెంటనే వసుధార అవును మేడం మీరు చెప్పింది నిజమే టైం ఒకసారి ఒక దగ్గర ఉంటుంది ఏది శాశ్వతం కాదు అంటూ దేవయానికి తనదైన శైలిలో సమాధానం ఇస్తుంది వసుధార. అప్పుడు దేవయాని నువ్వు తెలివైన దానివి యూనివర్సిటీ టాపర్ అని నాకు తెలుసు లోపల చాలా బాధను పెట్టుకొని బయటకు ధైర్యంగా మాట్లాడుతున్నావు.

Advertisement

అయినా రిషి మనసులో నువ్వు ఇంకా ఉన్నాను రిషీ మనసు మారుతుంది అని అనుకుంటున్నావా అని అంటుంది దేవయాని. అవును మేడం అని గట్టిగా సమాధానం చెబుతుంది వసుధార. ఇక ఇప్పుడు దేవయాని జగతి రిషి ఎప్పటికీ కలవడం నాకు ఇష్టం లేదు అన్న విధంగా మాట్లాడుతుంది. వసుధర కలిపి తీరుతాను అన్న విధంగా మాట్లాడుతుంది. అప్పుడు నువ్వు రెస్టారెంట్లకు వచ్చి పెళ్లిరోజు జరుపుదాము అన్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది దాని వెనక ఇంత రాక్షకత్వం ఉంటుంది అని అంటుంది వసు.

Advertisement

అయినా కూడా దేవయాని అలాగే అంటుంది. వసుధార ఏదో ఒక రోజు సార్ మీ నిజ స్వరూపం తెలుసుకుంటాడు ఆరోజు మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకున్నారా. ఆరోజు మీకు ఇంట్లో ఏ స్థానం దక్కుతుందో ఆలోచించారా అని అంటుంది వసు. అప్పుడు వెంటనే దేవయాని వసుధార ఫోన్ తీసుకొని రిషికి ఫోన్ చేయగా రిషి ఫోన్ కట్ చేసి వెంటనే స్విచ్ ఆఫ్ చేస్తాడు. అప్పుడు దేవయాని నిన్ను మెడబట్టి బయటికి ముందే మర్యాదగా వెళ్ళిపో అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దేవయాని.

Advertisement

మరొకవైపు రిషి జరిగినదంతా తలుచుకొని అంటే ఎన్ని రోజులు వస్తువు ద్వారా నాతో చేసిందంతా అబద్దామా. తన ప్రేమ అంతా కూడా మాయనా అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి మహేంద్ర వస్తాడు. అప్పుడు వెంటనే రిషి కోపంతో మీరు వెళ్లిపోండి నాకు ఒంటరిగా ఉండాలని ఉంది అని అంటాడు. అప్పుడు మహేంద్ర మాట్లాడడానికి ప్రయత్నించగా రిషి అక్కడి నుంచి వెళ్ళిపోమని అంటాడు.

Advertisement

అప్పుడు మహేంద్ర నీ అపార్థం చేసుకుంటాడు రిషి. అప్పుడు మహేంద్ర నచ్చచెప్పడానికి ప్రయత్నించినా కూడా రిషి తప్పుగా అపార్థం చేసుకుంటాడు. అప్పుడు మహేంద్ర మాట్లాడాలి అని చూస్తుండగా రిషి బయటికి వెళ్లిపోండి అంటూ తలుపుల వైపు చేయి చూపిస్తాడు. రిషి అన్న మాటలకు బాధపడిన మహేంద్ర ఏడ్చుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు వసు ధార కనిపించడంతో కంట్రోల్ నలకపడింది అని అబద్ధం చెప్పి ఎక్కడ నుంచి వెళ్ళిపోతాడు మహేంద్ర. అప్పుడు మహేంద్ర సోఫాలో కూర్చుని బాధపడుతూ ఉండగా ఇంతలో అక్కడికి జగతి వచ్చి ఓదారిస్తుంది. అప్పుడు జగతి భుజంపై పడుకుని మహేంద్ర ఏడుస్తాడు.

Advertisement
Advertisement